అర్నబ్ తుఫాను దెబ్బకు..చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర

×

అర్నబ్ తుఫాను దెబ్బకు..చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర

అర్నబ్ తుఫాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. తీరం దాటిన తర్వాత గంటకు 140 నుండి 160 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ తుఫాను సృష్టించిన బీభత్సం, నష్టం ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది. గాలుల తీవ్రత ఎంతగా ఉందంటే, మనుషులు కూడా కొట్టుకుపోయేటంత బలంగా వీచాయి.  కొబ్బరి చెట్లు ఊగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నేలకొరిగాయి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో తుఫాను గాలులు కొబ్బరి చెట్లను కట్టెపుల్లలు ఇరిచినట్లు విరిచిపడేశాయి, భారీ నష్టం కలిగించాయి. ఇళ్ళ షెడ్లు ఊడిపోయి, వాహనాలపై పడ్డాయి. కాకినాడ జిల్లాలో రోడ్ల వెంట చెట్లు విరిగిపడి రవాణాకు అంతరాయం కలిగింది. యానంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. సావిత్రినగర్ ప్రాంతంలో మనిషి మునిగేంత లోతుకు నీరు చేరింది. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించగా, అక్కడ కూడా మొదటి అంతస్తు నీట మునిగింది. దీంతో అధికారులు బాధితులను వెంటనే రెండో అంతస్తులకు తరలించి రక్షించారు. అర్నబ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి నష్టం, సాధారణ జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది.

Janardhan Veluru