AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీరు ఇలాంటి నిక్కరు వేసుకున్నారా..? చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్న బుడ్డోడు!

వదులుగా ఉన్న స్కూల్ యూనిఫాం నిక్కర్ వేసుకుని బడికి వెళ్తున్న చిన్నారి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ కామెంట్లు చేస్తున్నారు. మా నాన్న కూడా చిన్నప్పుడు యూనిఫాం ఇలానే కుట్టించేది అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

Viral Video: మీరు ఇలాంటి నిక్కరు వేసుకున్నారా..? చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్న బుడ్డోడు!
Childhood Memories
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2026 | 11:52 AM

Share

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని వీడియోలు మనల్ని నేరుగా చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఆ రోజుల్లోని అమాయకత్వాన్ని గుర్తుచేస్తూ మనసుకు హత్తుకుంటాయి. తాజాగా అలాంటి ఓ చిన్నారి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్న పిల్లాడు స్కూల్‌కు వెళ్తూ కనిపిస్తున్నాడు. అతను వేసుకున్న యూనిఫాం నిక్కర్ కాస్త పెద్దదిగా, వదులుగా ఉండటంతో జారిపోతున్నట్లు కనిపిస్తోంది. అతని వెనుక మరో చిన్నారి స్కూల్ బ్యాగ్‌ను తగిలించుకుని వస్తున్నాడు. ఈ దృశ్యం ఎంతో సహజంగా, స్వచ్ఛంగా ఉండటంతో నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఒకప్పుడు పిల్లలకు కొత్త బట్టలు కుట్టించేటప్పుడు కొంచెం పెద్ద సైజులో కుట్టించేవారు. పిల్లలు త్వరగా పెరుగుతారనే ఉద్దేశంతో రెండు, మూడేళ్లు వచ్చేలా నిక్కర్లు, షర్టులు కుట్టించేవారు. అప్పట్లో అవి వదులుగా ఉన్నా పిల్లలు వాటినే వేసుకుని బడికి వెళ్లేవారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలామంది తమ బాల్యంలోని ఇలాంటి మధురమైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘మా నాన్న కూడా ఇలాగే నిక్కర్లు కుట్టించేవారు’, ‘నా చిన్నప్పుడు కూడా రెండేళ్లు వచ్చేలా బట్టలు కుట్టించేవారు’, ‘ఐదేళ్ల వయసు వచ్చే వరకు నిక్కర్ కూడా వేసుకోకుండా షర్టు మోకాళ్ల వరకు కుట్టించేవారు’ అంటూ తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ఈ వీడియోలోని చిన్నారులను చూస్తుంటే బాల్యం ఎంత అందమైనదో మరోసారి గుర్తుకొస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో పెద్దగా అనిపించిన చిన్న చిన్న విషయాలే ఇప్పుడు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని అంటున్నారు.

కాలం మారింది.. పిల్లల దుస్తులు మారాయి.. జీవనశైలి కూడా మారిపోయింది. కానీ చిన్ననాటి జ్ఞాపకాలకు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే ఈ చిన్నారి వీడియో కేవలం ఓ సరదా దృశ్యంగా కాకుండా, చాలామందిని తమ బాల్యంలోకి తీసుకెళ్తూ నెట్టింట ఆకట్టుకుంటోంది. మళ్లీ తిరిగిరాని బాల్యాన్ని గుర్తుచేసి, ముఖంపై చిరునవ్వు తెప్పిస్తూ.. మనసులో చిన్నపాటి దిగులును మిగులుస్తోంది.

Follow Us
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది