AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Gift IT Rules: దీపావళి గిఫ్ట్ తీసుకుంటున్నారా..? బీ అలర్ట్.. ఈ లిమిట్ దాటితే ఇన్‌కమ్ ట్యాక్స్ చిక్కులు..

దీపావళి సందర్భంగా ఆఫీసుల్లో కొలీగ్స్, స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటూ ఉంటారు. ఇక బంధువులు, పొరుగువారు నుంచి గిఫ్ట్ స్వీకరిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఐటీ శాఖ విధించిన పరిమితి కంటే బహుమతులు ఎక్కువ తీసుకుంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

Diwali Gift IT Rules: దీపావళి గిఫ్ట్ తీసుకుంటున్నారా..? బీ అలర్ట్.. ఈ లిమిట్ దాటితే ఇన్‌కమ్ ట్యాక్స్ చిక్కులు..
Diwali Gift It Rules
Venkatrao Lella
|

Updated on: Oct 29, 2026 | 11:24 AM

Share

దీపావళి అనేది దేశంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ. కులమతాలకు అతీతంగా అందరూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబమంతా కలిసి స్వీట్లు పంచుకోవడం, టపాసులు పేల్చడం, కొత్త బట్టలు ధరించడం, ప్రత్యేక పూజలు చేయడం, రకరకాల వంటలు చేయడం లాంటివి భారతీయుల ఇళ్లల్లో చోటుచేసుకుంటూ ఉంటాయి. దీపావళికి ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది ఒక సాంప్రదాయంగా వస్తోంద. ఆఫీసుల్లో కొలీగ్స్‌తో పాటు పొరుగువారు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్‌లు అందుకుంటూ ఉంటారు. కొంతమంది నగదు రూపంలో బహుమతులు ఇస్తే.. మరికొంతమంది గిఫ్ట్ రూపంలో అందిస్తారు. ఒక లిమిట్ వరకు బహుమతులకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కానీ ఈ లిమిట్ దాటితే ఆదాయపు పన్నుశాఖ నుంచి చిక్కులు రావొచ్చు.

ఈ లిమిట్ దాడితే ఐటీ చిక్కులే..

బహుమతుల విషయంలో పన్ను నిబంధనలు కేటగిరిని బట్టి ఉంటాయి. సొంత కుటుంబసభ్యుల నుంచి అందుకునే బహుమతులపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. బహుమతుల విలువ రూ.లక్షల్లో ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. జీవిత భాగస్వామి, తోబుట్టువులు, తల్లిదండ్రులు, పూర్వీకులు, వారసుల నుంచి అందుకునే బహుమతులు జీరో ట్యాక్స్ పరిధిలో వస్తాయి. అయితే పొరుగువారు, బంధువులు, కుటుంబసభ్యులుకానివారు, స్నేహితుల నుంచి అందుకునే బహుమతులకు సంబంధించి ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేల విలువ దాటితే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. రూ.50 వేల విలువ వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఆ పరిధి దాటితేనే పన్ను పరిధిలోకి వస్తాయి. దీపావళికి బహుమతులు ఇచ్చేవారు, తీసుకునేవారు ఈ విషయాలను గమనించాలి. లేకపోతే ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుందని చెప్పవచ్చు. రూ.50 వేల పరిమితి దాటితే ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. అందుకే వీటిపై పన్ను ఉంటుంది.

వేర్వేరు వ్యక్తుల నుంచి అందుకున్నా..

ఒక ఆర్ధిక సంవత్సరంలో కుటుంబసభ్యులు కాని వ్యక్తుల అందరి నుంచి అందుకునే బహుమతుల విలువ రూ.50 వేలు దాటితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆర్ధిక సంవత్సరంలో పొరుగువారి నుంచి రూ.20 వేలు, ఆఫీస్ కొలీగ్ నుంచి రూ.15 వేలు, స్నేహితుడి నుంచి రూ.20 వేలు అందుకుంటే.. మొత్తం విలువ రూ.55 వేలు అవుతుంది. ఇలాంటి సమయంలో అదనంగా అందుకున్న రూ.5 వేలుపై కాకుండా మొత్తం రూ.55 వేలుపై ట్యాక్స్ విధిస్తారు. ఒక్కొ వ్యక్తి నుంచి అందుకునే మొత్తంపై కాకుండా ఒక ఆర్ధిక సంవత్సరంపై అందుకునే మొత్తంను కలిపి లెక్కిస్తారు. ఒక ఎవరినుంచైనా ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే ఐటీ శాఖ సమస్యలు రావొచ్చు.

దీపావళి గిఫ్ట్ తీసుకుంటున్నారా..?

మీరు దీపావళి గిఫ్ట్ తీసుకుంటుంటే ఇచ్చే వ్యక్తితో మీకు ఉన్న సంబంధం, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు అందుకున్న మొత్తం బహుమతుల విలువను దృష్టిలో పెట్టుకోండి. ఒక వ్యక్తి నుంచి ఒకే రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు బహుమతి రూపంలో అందుకుంటే ఐటీ శాఖ జరిమానా విధించే అవకాశముంటుంది. దీంతో బహుమతికి సంబంధించిన రికార్డులను భద్రపర్చుకోండి.

Follow Us