AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవైపు అర్నబ్ తుఫాన్.. మరోవైపు ఇంజిన్ ఫెయిల్.. అంతర్వేదికి కొట్టుకొచ్చిన మర్చంట్ షిప్..

Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన సిగ్మా పేరల్ కార్గో నౌకలోని 23 మంది సిబ్బందిని రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగింది. ఇంజిన్‌ ఫెయిల్యూర్‌, తీవ్ర సముద్ర ప్రవాహాల కారణంగా నౌక మార్గం తప్పినట్లు సమాచారం. మొగల్తూరు ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టి, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఓవైపు అర్నబ్ తుఫాన్.. మరోవైపు ఇంజిన్ ఫెయిల్.. అంతర్వేదికి కొట్టుకొచ్చిన మర్చంట్ షిప్..
Cargo Ship Rescue
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2026 | 11:27 AM

Share

ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న అర్నబ్ తుఫాన్‌ దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో ఏర్పడిన అలల తాకిడికి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మార్గం తప్పి కోనసీమ జిల్లా అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చింది. వైజాగ్‌ పోర్టులో సరుకు అన్‌లోడ్ చేసుకుని కాకినాడ మీదుగా సింగపూర్ వెళుతున్న మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన సిగ్మా పేరల్ కార్గో నౌక తుఫాన్‌లో చిక్కుకుంది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో ఇంజిన్ ఫెయిల్ కావడంతో పాటు తీవ్రమైన సముద్ర ప్రవాహాలు, ఈదురుగాలుల తాకిడికి నౌక అదుపు తప్పి కేజీ బేసిన్ సమీపంలో సుమారు 130 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయి చివరికి అంతర్వేది తీర ప్రాంతానికి చేరింది. సమాచారం అందుకున్న వైజాగ్ మెరైన్ అధికారులు, పోర్టు అథారిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నౌక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్‌ తీవ్రత తగ్గిన తర్వాత నౌకను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు పశ్చిమ గోదావరి మొగల్తూరులో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. తుఫాన్‌ కారణంగా అంతర్వేది దగ్గర చిక్కుకున్న నౌకను రెస్క్యూ చేసేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. మర్చంట్ షిప్‌లో 23 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని రెస్క్యూ చేసేందుకు కోస్ట్‌గార్డ్ ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాకుండా.. కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆ ప్రాంతంలో హెలిప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు.

సిగ్మా పెర్ల్.. మార్షల్ ఐ ల్యాండ్ షిప్.. సెల్ఫ్యూరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దానిలో ఫిలిప్పీన్స్ సిబ్బంది ఉన్నట్లుగా చెబుతున్నారు. మొగల్తూరు పోలీసుల సాయంతో వైజాగ్ కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా.. అంబులెన్సులను, ఇతర వాహనాలను కూడా సిద్ధం చేశారు.

Follow Us
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది