నల్గొండ పోలీసులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. నలుగురిని పట్టుకోగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 20 లక్షల నగదు, కార్లు, కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠాపై 29 దొంగతనం కేసులు నమోదయ్యాయి.. అందులో 18 నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి.