AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఈ నెలాఖరులోగా అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి తీపికబురు. గత నెలకు సంబంధించిన సొమ్ము మీ పీఎఫ్ ఖాతాలో ఇంకా జమ కాలేదా.. అయితే మీకు త్వరలో అందనున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ నెలా 15వ తేదీలోపు కంపెనీలు జమ చేయాల్స ఉంటుంది. అయితే వేతన పరిమితిలో మార్పులు జరగడంతో గడువు పొడిగించారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఈ నెలాఖరులోగా అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు..
Epfo
Venkatrao Lella
|

Updated on: Oct 29, 2026 | 12:00 PM

Share

మీరు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే ఇది మీ కోసమే. ప్రతీ నెలా మీ జీతం నుంచి 12 శాతాన్ని కట్ చేసి యాజమాన్యం వీటిని మీకు సంబంధించిన ప్రత్యేక పీఎఫ్ ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. అలాగే యాజమాన్యం తన వాటా కింద 12 శాతం చెల్లిస్తూ ఉంటుంది. కంపెనీ చెల్లించే వాటాలో 4 శాతం ఎంప్లాయర్ ఖాతాలో జమ అయితే.. మిగిలిన 8 శాతం పెన్షన్ అకౌంట్లో జమ అవుతుంది. నిబంధనల ప్రకారం మునుపటి నెలకు సంబంధించిన పీఎఫ్ సొమ్ము తర్వాతి నెల 15వ తేదీలోపు యాజమాన్యం ఉద్యోగి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్లు జమ చేసేందుకు యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ మరింత గడువు ఇచ్చింది. అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీంతో ఈ నెలాఖరులోపు ఉద్యోగి ఖాతాలో కంపెనీలు పీఎఫ్ వాటా తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది.

ఈ నెలాఖరులోగా అకౌంట్లోకి డబ్బులు..

యాజమాన్యాలు చలాన్ కమ్ రిటర్న్(ECR) దాఖలు చేయడం ద్వారా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో కాంట్రిబ్యూషన్లు జమ చేస్తాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇది దాఖలు చేస్తారు. దీంతో ఈ సొమ్ము ఈపీఎఫ్‌కు చేరి, అక్కడి నుంచి ఉద్యోగి ఖాతాకు అందుతాయి. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ముందుటి నెల చందాను తర్వాతి నెల 15వ తేదీలోపు ఖచ్చితంగా జమ చేయాలి. అయితే కేంద్రం గత నెలలో ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. దీని వల్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్లలో మార్పులు చోటుచేసుకోనుండగా.. కంపెనీలు తమ రికార్డులు, పేరోల్, కాంట్రిబ్యూషన్ల లెక్కింపులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేసుకోవడానికి కంపెనీలకు అవకాశం కల్పించేందుకు ఉద్యోగి ఖాతాలో పీఎఫ్ జమ చేయడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చింది. దీంతో అక్టోబర్ 31వ తేదీలోగా ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ నగదు జమ కానుంది.

పీఎఫ్ చెల్లింపులు పెరుగుతాయా..?

గతంలో పీఎఫ్ వేతన పరిమితి రూ.15 వేలు మాత్రమే ఉండటంతో 12 శాతం చొప్పున రూ.1800 కట్ అయ్యేవి. కానీ ఇప్పుడు రూ.25 వేలకు పెంచడంతో 12 శాతం చొప్పున చందా రూ.3 వేలకు పెరుగుతుంది. దీంతో మీ శాలరీలో రూ.3 వేల వరకు కట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది అందరికీ కట్ అవుతుందని కాదు. ప్రతీ కంపెనీ ప్రత్యేక నిబంధనలు పాటిస్తూ ఉంటుంది. దీంతో మీ వేతనం, సంస్థ అనుసరించే పద్దతి, మీ ఉద్యోగ స్థితిని బట్టి మార్పులు ఉంటాయి. అయితే ఉద్యోగి వాస్తవ వేతనం ఆధారంగా యాజమాన్యాలు మీ పీఎఫ్ లెక్కిస్తుంటే ఇప్పుడు ఎలాంటి మార్పులు ఉండవు. అధిక వేతనాల ప్రకారం చెల్లింపులు చేస్తుంటే ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఇప్పటినుంచి రూ.25వేలోపు జీతం తీసుకునేేవారు తప్పనిసరిగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. గతంలో వీరికి పీఎఫ్ అకౌంట్ లేకుండా ఇప్పుడు కొత్తగా చేరితే మీ శాలరీలో మార్పులు ఉంటాయి.

Follow Us
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం..
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
దీపావళి గిఫ్ట్ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే చిక్కులే
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది
చిటికెడు ఇంగువ,గ్లాసు నీరు! ఉదయాన్నే తాగితే శరీరంలో ఏం జరుగుతుంది