AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: రెండో వందే భారత్ స్లీపర్ రైలుపై బిగ్ అప్డేట్.. ఈ రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. ఆ రోజే ప్రారంభం..

దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరుగులు తీసేందుకు అంతా సిద్దమైంది. దీపావళి కానుకగా రెండో రైలు పట్టాలెక్కించనున్నారు. ఈ మేరకు రూట్ కూడా ఖరారు అయింది. అక్టోబర్ 31వ తేదీన రెండో స్లీపర్ రైలు పరుగులు తీసేందుకు రంగం సిద్దమైంది.

Vande Bharat Sleeper: రెండో వందే భారత్ స్లీపర్ రైలుపై బిగ్ అప్డేట్.. ఈ రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. ఆ రోజే ప్రారంభం..
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Oct 29, 2026 | 12:28 PM

Share

వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక్క వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తోండగా.. మరిన్ని సర్వీసులు విడతల వారీగా రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. దీంతో రెండో ట్రైన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని రైల్వే ప్రయాణికులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు రెండో భారత్ స్లీపర్ రైలుపై క్లారిటీ వచ్చింది. దీపావళి కానుకగా రెండో సర్వీసును పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు అయింది. పండక్కి ముందే అక్టోబర్ 31వ తేదీన రెండో వందే భారత్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది..? ఏయే స్టేషన్లలో ఆగుతుంది..? దీని ప్రత్యేకతలు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

రెండో వందే భారత్ స్లీపర్ రైలు వివరాలు

రెండో వందే భారత్ స్లీపర్ రైలు అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. వారణాసి-ఢిల్లీ మధ్య దీనిని తిప్పనున్నారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ రైలును ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనిని నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రాత్రిపూట ప్రయాణించేవారికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది. యూపీలోని నాలుగు కీలక నగరాల్లో ఇది ఆగనుంది. ప్రయోగరాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్, ఘజియాబాద్ స్టేషన్లలో స్టాపులు కల్పించారు. యూపీలోని అనేక ప్రధాన నగరాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించడంలో ఇది కీలకంగా మారనుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అన్నీ ఏసీ స్లీపర్ కోచ్‌లే ఉంటాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండగా.. 160 కిలోమీటర్లు వేగంతో నడుస్తాయి.

మొత్తం ఎన్ని బెర్త్‌లు ఉంటాయంటే..?

ఈ స్లీపర్ రైల్లో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఏసీ థర్డ్ టైర్ బెర్త్‌లు 611, ఏసీ 2 టైర్ బెర్త్‌లు 188, మొదటి ఏసీ బెర్త్‌లు 24 అందుబాటులో ఉంటాయి. ఇక రాత్రిపూట నిద్రపోతూ హాయిగా ప్రయాణించేందు వీలుగా ప్రత్యేకంగా సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. ఇక 52 వాక్యూమ్ టాయిలెట్లు, సీల్డ్ గ్యాంగ్‌వేలు ఉంటాయి. ఆహారం వడ్డించడానికి చిన్న చిన్న నిల్వ గదులు అందుబాటులో ఉంటాయి. ఇక దేశీయ కవచ్ వ్యవస్థ, నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు, మంటలను నియంత్రించేందుకు అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థలు వంటివి ఉంటాయి. కాగా ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య తొలి స్లీపర్ రైలు నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో దీనిని ప్రారంభించగా.. ప్రయాణికుల నుంచి అద్బుత స్పందన వస్తోంది. దీంతో దశలవారీగా ఈ రైలు సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. త్వరలో బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడపనున్నారు. నవంబర్‌లో ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ రైలు ఏపీలోని అనంతపురం, గుంతకల్ స్టేషన్ల మీదుగా వెళ్లనుంది.

Follow Us
ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?
ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?
ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..
సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..
ఎలాన్ మస్క్ ఆలోచనలు ఇలా ఉంటాయా..! ఇవి ఫాలో అయితే లైఫ్‌లో సక్సెస్
ఎలాన్ మస్క్ ఆలోచనలు ఇలా ఉంటాయా..! ఇవి ఫాలో అయితే లైఫ్‌లో సక్సెస్
ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. కన్ఫార్మ్ చేసిన గీతా భాస్కర్..
ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. కన్ఫార్మ్ చేసిన గీతా భాస్కర్..
తులసి, శాలిగ్రామాల వివాహం తర్వాతే పెళ్లిళ్లు ఎందుకు మొదలవుతాయి?
తులసి, శాలిగ్రామాల వివాహం తర్వాతే పెళ్లిళ్లు ఎందుకు మొదలవుతాయి?
ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు.. రేపే కేంద్రం బిగ్ అప్డేట్..
ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు.. రేపే కేంద్రం బిగ్ అప్డేట్..
రోజూ చేపలు తింటే శరీరంలో ఇన్ని మార్పులా.. అక్కడ రోజూ ఉండాల్సిందే
రోజూ చేపలు తింటే శరీరంలో ఇన్ని మార్పులా.. అక్కడ రోజూ ఉండాల్సిందే
పిల్లలకు ఎంతో ఇష్టమైన పప్పు చకోడీలు.. ఇలా చేస్తే
పిల్లలకు ఎంతో ఇష్టమైన పప్పు చకోడీలు.. ఇలా చేస్తే