AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది.. వారానికి ఒక్కసారి తినండి చాలు..

Calcium Rich Foods: కాల్షియం లోపం ఎముకల బలహీనతకు దారితీయవచ్చు. పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, ఆకుకూరలు, చిన్న చేపలు, టోఫు వంటి ఆహారాలతో శరీరానికి కాల్షియం అందించవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కాల్షియం లోపాన్ని నివారించడానికి ఎలాంటి ఆహార అలవాట్లు పాటించాలో తెలుసుకోండి.

నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది.. వారానికి ఒక్కసారి తినండి చాలు..
Foods For Strong Bones
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2026 | 12:44 PM

Share

ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన ఎముకలు, పటిష్టమైన నరాలు అత్యంత కీలకం. కొంతమంది చిన్న వయసులోనే నడుమునొప్పి, మోకాళ్ళ నొప్పులు, అలసటతో బాధపడుతుంటే, మరికొందరు వృద్ధాప్యంలోనూ చలాకీగా కనిపిస్తారు. ఈ తేడాకు ప్రధాన కారణం ఎముకలు, నరాల ఆరోగ్యం. కాల్షియం లోపం అస్థిపంజర వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల ఎముకలు గుల్లబారి, నరాలు క్షీణించి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యలకు ఆయుర్వేద, ఆధునిక వైద్య శాస్త్రాలు రెండూ కాల్షియం లోపమే ముఖ్య కారణమని నొక్కి చెప్తున్నాయి. అయితే.. ప్రత్యేక ఆహార ప్రణాళిక ద్వారా కొంత మేర నరాల బలహీనతను తగ్గించుకోవడమే కాకుండా, ఎముకలను కూడా బలోపేతం చేసుకోవచ్చంటున్నారు ఆయర్వేద నిపుణులు..

కాల్షియం లోపం: కారణాలు, లక్షణాలు

కాల్షియం లోపం అనేక సమస్యలకు మూలం. ఎముకలు దెబ్బతగలకుండానే విరిగిపోవడం, అరిచేతులు, అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవడం వంటివి కాల్షియం లోప లక్షణాలు. పిల్లల్లో ఎత్తు పెరగకపోవడం, దంతక్షయం కూడా కాల్షియం లోపం వల్లనే సంభవిస్తాయి. శరీరానికి ఆధారాన్ని, బలాన్నిచ్చే ఎముకలు క్షీణిస్తే మనిషి వంగిపోతాడు.. చురుకుదనం తగ్గిపోతుంది, ఎత్తు తగ్గిపోతాడు. వయసు పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారి ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తాయి.. ఇది సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్పాంటేనియస్ ఫ్రాక్చర్‌లకు కారణమవుతుంది. నడుములోని వెన్నుపూసలలో కాల్షియం తగ్గడం వల్ల అవి మెత్తబడి, ఎత్తు తగ్గి, గుని రావడానికి దారితీస్తుంది.

కాల్షియం వనరులు – వారం రోజుల ప్రణాళిక

క్రమం తప్పకుండా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే మీలో మార్పు కనిపించడం ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు డైటీషియన్లు..

ఆకుకూరలు: కాల్షియం పుష్కలంగా లభించే ఆకుకూరలు, మొహం చిట్లించేవారు కూడా వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన వనరులు.

పాలు, పాల పదార్థాలు: పాలు కాల్షియానికి గొప్ప మూలం. రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, పన్నీర్ వంటివి చేర్చుకోవాలి.

నువ్వులు: నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలుగా చేసుకొని తినడం వల్ల కాల్షియం, ఐరన్ రెండూ లభిస్తాయి. తాటి బెల్లం వాడటం మరింత మంచిది.

రాగులు: రాగి జావ, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ముద్ద వంటివి కాల్షియంను అందిస్తాయి. రాయలసీమ ప్రాంతాల్లో రాగుల వినియోగం ఎక్కువ కావడంతో అక్కడి ప్రజలు బలిష్టంగా ఉంటారని గమనించవచ్చు.

చేపలు: ముఖ్యంగా చిన్న చేపలు, వాటి ముల్లుతో సహా తినడం వల్ల పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. బొమ్మిడాయిలు వంటివి ఉదాహరణ.

చికెన్ ఎముకలు – మటన్ పాయ: బ్రాయిలర్ చికెన్ ఎముకలను నమిలి తినవచ్చు. మాంసాహారులు మేక, గొర్రె పాయ సూప్ తాగడం వల్ల బోన్ మ్యారోలోని కాల్షియంను పొందవచ్చు.

సోయా ఉత్పత్తులు: సోయా చిక్కుళ్లు, టోఫు (సోయా పనీర్), సోయా పాలు వంటివి సహజసిద్ధమైన ఫైటో ఈస్ట్రోజెన్లను అందిస్తాయి. ఇవి ఈస్ట్రోజెన్ లోపాన్ని నివారించి ఎముకల పెలుసుదనాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఈస్ట్రోజెన్ లోపం వల్ల వచ్చే తలనొప్పి, ఒంటిమీద సెగలు, చిరాకు, కీళ్ళ నొప్పులు వంటి అనేక సమస్యలను నియంత్రించగలవు. సోయా పాలు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.. నానబెట్టిన సోయా గింజలను మిక్సీ చేసి, పసుపు, మిరియాలపొడి, దాల్చినచెక్క పొడి, తేనె లేదా ఎండు ఖర్జూరం పొడి కలుపుకొని తీసుకోవచ్చు.

వీటిని వారానికి ఒక్కసారి చొప్పున తీసుకోవడం ద్వారా.. శరీరానికి శక్తి అందడంతోపాటు రోజంతా ఎనర్జీగా ఉంచుతాయి.. ఆయుర్వేదం అస్థి ధాతువు బలంగా ఉంటేనే శరీరం అస్థిత్వంతో, బలంగా ఉంటుందని చెప్తుంది. వృద్ధాప్య జనిత క్షయం వల్ల కలిగే కాల్షియం లోపాన్ని ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులతో నివారించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం సహజసిద్ధమైన ఆహారంతో కాల్షియం లోపాన్ని సరిదిద్దుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.
ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..
ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే
మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే
నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..
నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..
విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..
విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..
2 స్పూన్లు నిమ్మ చెట్టుకు ఇచ్చి చూడండి.. ఇక కాయలే కాయలు
2 స్పూన్లు నిమ్మ చెట్టుకు ఇచ్చి చూడండి.. ఇక కాయలే కాయలు
ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని..
ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని..
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?