హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ సతీమణి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇందుజా కలిశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వేధింపులకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులపై ఆమె ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.