AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాధపడకు తల్లి..! రోబో శంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించిన ధనుష్

మిళ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితం మరణించారు. ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు

బాధపడకు తల్లి..! రోబో శంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించిన ధనుష్
Dhanush
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2025 | 11:07 AM

Share

ధనుష్.. తమిళ్ లో స్టార్ నటుడిగా దూసుకుపోతున్నాడు ఈ హీరో.. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ విభిన్న పాత్రలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇటీవలే కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే కాదు.. హాలీవుడ్ లోనూ ధనుష్ నటించి మెప్పించాడు. ఇతర హీరోల మాదిరిగా కాకుండా ధనుష్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు ధనుష్ ఎన్నో సందర్భాల్లో తన గొప్పమనసును కూడా చాటుకున్నాడు. తాజాగా ధనుష్ తనతో నటించిన నటుడు రోబో శంకర్ మృతికి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో రోబో శంకర్ నిన్న (సెప్టెంబర్ 18న ) కన్నుమూశారు.

ఈ స్టార్ హీరో అమ్రీష్ పురి మనవడా..! బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడుగా

ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. గత కొన్ని నెలలుగా ఆయన కామెర్లుతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే సెప్టెంబర్ 18న మరణించారు. ఆయనకు 46 ఏళ్లు.

ఇవి కూడా చదవండి

ఫస్ట్ నైట్‌ను వీడియో తీసుకున్న భర్త.. కట్ చేస్తే ట్విస్ట్.. అప్పుడే అసలు సినిమా మొదలు.. ఎక్కడ చూడొచ్చంటే

రోబో శంకర్ మృతి పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ శంకర్ మృతికి సంతాపం తెలిపారు. తాజాగా ధనుష్ రోబో శంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. రోబో శంకర్ కూతురు లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్‌ను ధనుష్ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారి, మారి 2 సినిమాలో ధనుష్ తో పాటు రోబో శంకర్ నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్స్‌లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా రామ్ చరణ్‌కు తల్లిగా.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి