Dhanush: వరుస సినిమాలతో దూసుకుపోతోన్న వర్సటైల్ యాక్టర్.. ధనుష్ నయా మూవీ అప్డేట్ వచ్చేసింది
ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం అనౌన్స్ అయ్యింది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఒక భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఈ సినిమాను ప్లాన్ చేశారట శేఖర్ కమ్ముల. 1950 లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ధనుష్ తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కథ ఒక స్లమ్ ఏరియాలో జరగనుందనే హింట్ ఇస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని సన్ పిక్చర్స్ వారు తెలియజేశారు. ఈ కథ నార్త్ చెన్నైకి సంబంధించిన ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ను సన్ పిచర్స్ నిర్మించనుంది.
ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.ఈ సినిమాలో ధనుష్ చెల్లెలి పాత్రను దుషార విజయన్ పోషించనుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాకి ‘రాయన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అప్డేట్ ఇవ్వనున్నారు.
We are happy and proud to announce #D50 with @dhanushkraja#D50bySunPictures #Dhanush50 pic.twitter.com/Y52RUonvUD
— Sun Pictures (@sunpictures) January 18, 2023