Allu Arha: సమంత శాకుంతలం సినిమాకు డబ్బింగ్ ప్రారంభించిన అల్లు అర్హ.. ఎంత క్యూట్‌గా ఉందో.. ఫొటోస్ వైరల్
ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తూన్న క్లిప్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైన సంగతి తెలిసిందే. అందులో ఎంతో క్యూట్‌గా, అందంగా కనిపించిందీ బన్ని తనయ. తాజాగా శాకుంతలం సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది అర్హ.

ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక స్టార్‌కిడ్‌గా బన్నీ కుమార్తె అల్లు అర్హ కూడా చిన్న వయసులోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువైన ఈ క్యూట్ కిడ్ ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై కూడా ఎంట్రీ ఇస్తోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోన్న శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరకు పరిచయం కానుంది. ఇందులో అర్హ భరతుడ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తూన్న క్లిప్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైన సంగతి తెలిసిందే. అందులో ఎంతో క్యూట్‌గా, అందంగా కనిపించిందీ బన్ని తనయ. తాజాగా శాకుంతలం సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది అర్హ. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తన కూతురు స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న ఫొటోను షేర్ చేస్తూ దానిపై హార్ట్ సింబల్ చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శాకుంతలం సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణి శర్మ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రీడీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఎస్ఎస్ఎంబీ28’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలోనూ అల్లు అర్హ నటిస్తోందని టాక్. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.





Allu Arha
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..