Dhanush : తెలుగులో ధనుష్ దూకుడు.. ఈసారి క్రేజీ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్.. ఇక రచ్చే…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోలు సక్సెస్ అవుతున్నారు. డబ్బింగ్ సినిమాలు కాకుండా నేరుగా తెలుగులోనే పలు చిత్రాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. అందులో ధనుష్ ఒకరు. ఇటీవలే కుబేర చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ధనుష్.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

Dhanush : తెలుగులో ధనుష్ దూకుడు.. ఈసారి క్రేజీ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్.. ఇక రచ్చే...
Dhanush

Updated on: Sep 05, 2025 | 11:49 AM

తమిళ హీరో ధనుష్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లక్రితం ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇటీవలే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో హిట్ అందుకున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అంతకు ముందు సార్ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే జనాలకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధనుష్ తెలుగులో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

ఇప్పుడు ముచ్చటగా మూడో తెలుగు సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం తెలుగు డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పిన కథ ధనుష్ కు నచ్చిందని.. దీంతో ఆ సినిమా చేసేందుకు రెడీ అని చెప్పారట. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

డైరెక్టర్ వేణు ఉడుగుల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు ధనుష్ తో ఓ సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..