AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ‘దేవర’ కోసం జాన్వీ కసరత్తులు.. సారాతో కలిసి జిమ్‏లో చెమటలు చిందిస్తోన్న బ్యూటీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో మత్య్సకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది జాన్వీ. అయితే ఇందులో జాన్వీ పాత్రకు పలు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాలో దేవర యాక్షన్ షూట్ షెడ్యూ్ల్ స్టార్ట్ అయ్యింది.

Janhvi Kapoor: 'దేవర' కోసం జాన్వీ కసరత్తులు.. సారాతో కలిసి జిమ్‏లో చెమటలు చిందిస్తోన్న బ్యూటీ..
Janhvi Kapoor, Sara Ali Kha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2023 | 4:48 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హవా నడిపిస్తోంది జాన్వీ కపూర్. ఇతర హీరోయిన్స్ మాదిరిగా కాకుండా విభిన్న జోనర్ చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో మత్య్సకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది జాన్వీ. అయితే ఇందులో జాన్వీ పాత్రకు పలు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాలో దేవర యాక్షన్ షూట్ షెడ్యూ్ల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లోనే జాన్వీతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ జిమ్‏లో చెమటలు చిందిస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అది కూడా తన స్నేహితురాలు సారా అలీ ఖాన్‏తో కలిసి కష్టపడుతోంది జాన్వీ. బాలీవుడ్ ఇండస్ట్రీలో సారా, జాన్వీ ప్రాణస్నేహితులు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే విదేశాలకు చెక్కేస్తారు ఈ ఇద్దరు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి వర్కవుట్ సెషన్ కు హాజరయ్యారు. ఇద్దరు కలిసి కష్టమైన వర్కవుట్స్.. ఎంతో సరదాగా చేస్తున్నారు.

అలాగే అంతకు ముందు జాన్వీ జిమ్ లో భారీ వర్కవుట్స్ చేస్తోన్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో జాన్వీ ఎంతో కఠినమైన.. భారీ వర్కవుట్స్ చేస్తూ కనిపించింది. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. ఇటు దేవర సినిమాతోపాటు తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యింది జాన్వీ. అంతేకాకుండా తనకు ఆఫర్స్ వస్తే తమిళంలోనూ చిత్రాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.