సాయి తేజ్- దేవా కట్టా మూవీ అప్డేట్
టాలీవుడ్ లో ఉన్న ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ లిస్టులో దేవా కట్టా కూడా ఉంటారు. కానీ ఎందుకో ఆయనకు గత కొంతకాలంగా టైమ్ కలిసిరావడం లేదు.

టాలీవుడ్ లో ఉన్న ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ లిస్టులో దేవా కట్టా కూడా ఉంటారు. కానీ ఎందుకో ఆయనకు గత కొంతకాలంగా టైమ్ కలిసిరావడం లేదు. తాజాగా మెగా హీరో సాయి తేజ్.. దేవా కట్టా చెప్పిన లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో సాయి తేజ్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో నటించనున్నాడని సమాచారం. ఇక ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు దేవా కట్టా. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నేటి నుంచి షురూ అయినట్లు తెలిపారు. షూటింగ్ కు సంబంధించిన పనులపై డిస్కస్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ అండ్ టీం దిగిన దిగిన ఫొటో స్నాప్ చాట్ దేవాకట్టా ట్విటర్ లో పోస్ట్ చేశాడు.
అక్టోబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు దేవా తెలిపారు. సాయి తేజ్-దేవాకట్టా మూవీలో పలువురు ప్రముఖ నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో వెల్లడించనున్నారు. గతేడాది సంజయ్ దత్ తో హిందీలో ప్రస్థానం రీమేక్ చేసిన దేవాకట్టా..ఈ ఏడాది సాయి తేజ్, అమెజాన్ ప్రైమ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు.
SDT#14 prep work on high gear!! Twelve-aspect Mise-En-Scene session-1 with all HoDs!! Shoot from mid October! @IamSaiDharamTej @bkrsatish pic.twitter.com/OAby6rGTxS
— deva katta (@devakatta) September 23, 2020




