Shannu-Deepthi: 5 ఏళ్ల ప్రేమ.. ముక్కలైన వేళ.. అక్కడే బంధానికి బీటలు..

బిగ్‌బాస్‌ ఎంత పనిచేశాడబ్బా... ! అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న ప్రేమ జంట మధ్య ఆరని చిచ్చే పెట్టేశాడు. ఐదేళ్లుగా సాగుతున్న ప్రేమాయణానికి.. పుల్‌స్టాప్‌ పెట్టించేశాడు

Shannu-Deepthi: 5 ఏళ్ల ప్రేమ.. ముక్కలైన వేళ.. అక్కడే బంధానికి బీటలు..
Deepthi Shanmukh Breakup
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 01, 2022 | 9:23 PM

బిగ్‌బాస్‌ ఎంత పనిచేశాడబ్బా… ! అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న ప్రేమ జంట మధ్య ఆరని చిచ్చే పెట్టేశాడు. ఐదేళ్లుగా సాగుతున్న ప్రేమాయణానికి.. పుల్‌స్టాప్‌ పెట్టించేశాడు. షణ్ణూ,దీప్తి సునయన మధ్య ఏర్పడిన సిమెంటు గోడలాంటి బలమైన బంధానికి కూడా దెబ్బకు బీటలు పడేలా చేశాడు. సిరి రూపంలో.. వాళ్లిద్దరి మధ్యకి ఒక అందమైన విలన్‌ను పంపించి పెద్ద దెబ్బే కొట్టాడుగా బిగ్‌బాస్‌. నిన్నటి వరకు ఉన్న హగ్‌లు ఇప్పుడు లేవు. నిన్నటి వరకు ఉన్న నవ్వుల తుళ్లింతలు నేడు లేవు. దీప్తి, షణ్ముక్‌ మధ్య ప్రేమయణానికి బ్రేకప్ పడింది.

అసలు బిగ్‌బాస్‌ అనేదే లేకపోతే… షణ్ణూకి, సిరి మధ్య అంతటి బలమైన రిలేషణ్ ఏర్పడేదా? అనేదే ఇప్పుడు చర్చగా మారింది. తను ప్రాణంగా ప్రేమించిన లవర్‌తో.. మరొక యువతి అంత క్లోజ్‌గా మూవ్ అవుతుంటే ఏ అమ్మాయి మాత్రం సిద్ధంగా ఉంటుంది. అందుకే, దీప్తి సునయన .. భగ్గుమంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో సిరి, షన్ణూల మధ్య క్లోజ్‌నెస్‌ చూసి.. ఆమె గుండె బద్ధలైంది. అందుకే, బ్రేకప్‌ చెప్పేసిందట. నిన్నటి వరకూ కనిపించిన అప్యాయ పలకరింపులు, గుండె లోతుల్లోనుంచి వచ్చే పిలుపులు.. ఎంతో హాయిగా అనిపించేవి. కానీ, ఇప్పుడవి లేవు. అన్నీ మాటాష్‌. అదృశ్యమైపోయాయి.

ఔను..! వాళ్లిద్దరూ విడిపోయారు! ఔను.. వాళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఎవరు నమ్మినా,, నమ్మకపోయినా… మరెవరికి నచ్చినా నచ్చకపోయినా.. ఇదే నిజం. ఇది మాత్రమే నిజం. ఐదేళ్ల బంధం… మామూలుగా కాదు.. ఫెవికాల్‌తో పెనవేసుకున్న ధృడమైన బంధం… దీప్తి సునాయన విత్ షణ్ముక్… ఎంతో చూడముచ్చటైన జంట. వీరి రిలేషన్‌కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ గానీ, మద్దతుగానీ చాలానే ఉంది. చైనావాల్‌ లాంటి ఈ స్ట్రాంగ్‌ రిలేషన్‌ కు బీటలు వారడం.. జీర్ణించుకోలేకపోతున్నారు ఫాలోవర్స్‌.

ఇద్దరు లవర్స్‌ మధ్య మూడో వ్యక్తి ఎంటరైతే… మ్యాటర్‌ ఖతం. ఆడైనా, మగైనా మూడో వ్యక్తికి జాగా ఇవ్వడం అంటే… కొరివితో తలగోక్కున్నట్టే. షణ్ణూ, దీప్తి విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరి మధ్యా సిరి అనే గిరిగీత వచ్చేసింది.. ఆ గీత చాలా పెద్దదైంది. ఎంతంటే.. ఇన్నాళ్లూ అన్యోన్యంగా ఉన్న జంట… ఒక్కసారిగా బ్రేకప్‌ చెప్పుకునేంత. తాజా ఎపిసోడ్‌ గమనిస్తే ఇది నిజమే అనిపించకుండా ఉండదు.

యూ ట్యూబ్‌ స్టార్‌గా మంచి ఫాలోయింగ్‌ సంపాదించాడు షణ్ణూ. ఇక, షార్ట్‌ ఫిల్మ్స్‌లో సూపర్‌ స్టార్‌గా ఎదిగింది దీప్తి సునయన. వీళ్లిద్దరి మధ్యా ఐదేళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది. ఎంత క్లోజ్‌ అయ్యారంటే… వన్‌ ప్లస్‌ వన్‌ ఈజ్‌ ఈక్వల్‌ టు.. టూ కాదు… వన్‌ ప్లస్‌ వన్‌ ఈజ్‌ ఈక్వల్‌ టు వన్‌.. అంటూ కొత్త క్యాలిక్యులేషన్‌ చెప్పేసుకున్నారు. మేమిద్దం ఒక్కటే బలగుద్ది చెప్పుకొన్నారు. చెప్పినట్టుగానే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు.. బిగ్‌బాస్‌ దిష్టి పెట్టేశాడు. అందుకే సీన్‌ మొత్తం రివర్సైపోయింది. అన్యోన్యత కాస్తా సైడైపోయి.. అనుమానాలకు ప్లేసిచ్చింది. సంతోషాలు మాయమైపోయాయి… వండర్‌ ఫుల్‌గా సాగుతున్న ఇద్దరి లవ్‌ జర్నీలోకి ట్రాజెడీ ఎపిసోడ్‌ ఎంట్రీ ఇచ్చేసింది.

షణ్ణూ, దీప్తి మధ్య ఏర్పడిన అగాథానికి.. సిరి ఎంట్రీయే కారణమా? బిగ్‌బాస్‌కు రాకపోయుంటే.. సిరి పరిచయం కాకుంటే.. షణ్ముక్, దీప్తి రిలేషన్‌ కంటిన్యూ అయ్యేదా? సిరి రాకతోనే.. వీరి ప్రేమ బ్రేకప్‌ వరకు వెళ్లిందా? అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చలో మెయిన్‌ పాయింట్‌. అయితే, చాలావరకు నిజమే అనిపిస్తోంది. తను ప్రాణంగా ప్రేమించే అబ్బాయికి.. మరో అమ్మాయి విచ్చలవిడిగా, హగ్గులు, కిస్సులు ఇస్తుంటే.. ఏ లవర్‌ మాత్రం తట్టుకోగలదు. అందుకే, షణ్ణుపై సిరి కురిపించిన కౌగిలింతలు, ముద్దుల వర్షం.. దీప్తి కంట కన్నీరు పెట్టించాయి. గుండెల్లో ఆరని మంటల్ని రాజేశాయి. అందుకే, తీవ్రమైన నిర్ణయమే తీసుకుంది ఈ యూట్యూబ్‌ బ్యూటీ. దానికి నిదర్శనం తాజా పరిణామాలే.

దీప్తి సునయన, షణ్ముక్.. రియల్ లైఫ్‌ లవ్‌ బర్డ్స్‌. బిగ్‌బాస్‌ కారణంగా.. షణ్ణూ పక్కన వచ్చి చేరింది సిరి. ఈ రెండు రిలేషన్స్‌ మధ్యా చాలా తేడా ఉంది. నిజజీవితంలో దీప్తి, షణ్ణూ ప్రేమ గీతాలు పాడుకుంటే… బిగ్‌బాస్‌ హౌజ్‌లో షణ్ణూతో కలిసి డ్యుయట్స్‌ వేసుకుంది సిరి. అంతేకాదు, షణ్ముఖ్‌ కూడా ఆమెతో బాగానే కనెక్టయ్యాడు. అలా, షణ్ముక్ దూరమయ్యాడని దీప్తి సునయన కన్నీరు పెడుతోంది. చివరికి బ్రేకప్‌ వరకూ వెళ్లిపోయింది మేటర్‌.

నిజం చెప్పాలంటే.. బిగ్‌బాస్‌ కారణంగా షణ్ణూ, సిరి.. మోస్ట్‌ డిజైరెబుల్‌ పెయిర్‌గా మారిపోయారు. అప్పటి వరకూ షణ్ణూ పక్కన దీప్తి మాత్రమే అన్నట్టుగా ఉన్న ట్రెండ్‌… ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఉడికెత్తిపోయిందామె. వరుసగా సోషల్‌ మీడియా వేదికగా.. షణ్ముఖ్‌పై పోస్టుల బాణాలు వదలటం మొదలెట్టింది. నాలుగు రోజులు వదిలేస్తే.. వేరే వాళ్లతో కనెక్ట్ అయితే జీవితాంతం.. ఇన్‌సెక్యూరే అంటూ తాజాగా పోస్టు పెట్టింది. తన లవర్‌తో మరో వ్యక్తి క్లోజ్‌గా ఉండటం పట్ల.. భావోద్వేగానికి లోనైంది. అయితే, ఓవైపు బ్రేకప్ ఎపిసోడ్స్ నడుస్తుంటే దీప్తి ఏదేదో అనుకుంటోందని చెబుతున్నాడు షణ్ముఖ్‌. తనే మళ్లీ ఆలోచన మార్చుకుంటోందంటున్నాడు .

షణ్ముక్‌కు రియల్‌ లైఫ్‌ గాల్‌ఫ్రెండ్‌గా దీప్తి సునయన ఉన్నట్టే… సిరికి కూడా రియల్‌ లైఫ్‌లో బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. అతనే శ్రీహాన్‌. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన లవర్‌… మరొకరితో హగ్గింగ్స్‌, కిస్సింగ్స్‌తో బిజీగా ఉంటే.. తను మాత్రం సింగిల్‌గా విరహగీతాలు పాడుకుంటున్నాడు పాపం. ఇలా… బిగ్‌బాస్‌ రెండు జంటల మధ్యా చిచ్చు పెట్టేశాడు.

నిన్నటి వరకు నువ్వులేక నేను లేను అంటూ.. సిరిని తలచుకున్న శ్రీహాన్‌.. ఇప్పుడు స్యాడ్‌ సాంగ్స్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. తన ప్రియరాలు.. షణ్ముక్‌కు దగ్గరవ్వడంతో… ప్రేమఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. అంటూ ఓల్డ్‌ సాంగ్‌తో పాత మెమరీలు గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నాడు. అమ్మాయైనా, అబ్బాయైనా.. ప్రేమ విషయంలో ఒకటే ఫీలింగ్‌ ఉంటుంది భయ్యా. తన పార్ట్‌నర్‌తో మరో వ్యక్తి డ్యుయట్‌ వేసుకుంటే.. ఎవరికైనా సుర్రున కాలుతుంది. ఈ విషయంలో దీప్తి సునయనది, శ్రీహాన్‌ ది ఒకటే ఫీలింగ్‌. ఇప్పటికే డీప్‌గా హర్టయిన దీప్తి… బాయ్ ఫ్రెండ్‌కు కటీఫ్‌ చెప్పేసింది. ఇన్నాళ్ల తమ ప్రేమకు తిలోదకాలు ఇచ్చేసింది. . ఇప్పుడు ఈ రెండు జంటల మధ్య ఏం జరిగినా.. అందుక్కారణం మాత్రం బిగ్‌బాసే భయ్యా! అని దుమ్మెత్తి పోసేవారే ఎక్కువ.

Also Read: East Godavari: నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమె కాపాడిన కౌన్సిలర్.. కానీ

Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే