Daaku Maharaaj Collection Day 1: బాక్సాఫీస్‌ను షేకాడిస్తున్న డాకు మహారాజ్.. తొలిరోజే కలెక్షన్ల ఊచకోత!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య.. మాస్‌ మువీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన యువ డైరెక్టర్‌ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ ను షేకాడిస్తుంది. తొలి రోజే భారీగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు పాజిటివ్ రివ్యూలు బాగా కలిసొచ్చాయి. ఇదే జోరు నేడూ కొనసాగుతుంది. థియేటర్లన్నీ జనాలతో కిటకిటలాడిపోతున్నాయ్..

Daaku Maharaaj Collection Day 1: బాక్సాఫీస్‌ను షేకాడిస్తున్న డాకు మహారాజ్.. తొలిరోజే కలెక్షన్ల ఊచకోత!
Daaku Maharaaj
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 13, 2025 | 4:49 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించింన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. మాస్‌ మువీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరుగాంచిన యువ డైరెక్టర్‌ బాబీ కొల్లి, బాలయ్య కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మువీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. మరోవైపు పాజిటివ్ రివ్యూలు, మౌత్‌ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసింది. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. డాకు మహరాజ్‌ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఏకంగా రూ.56 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ రోజు ఆదివారం, పైగా పండగా కూడా.. దీంతో థియేటర్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు కూడా బ్లాక్‌బస్టర్ జోరును కొనసాగిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మువీ సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్‌ను మరింత కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మాంచి ఊపులో ఉన్న బాలయ్య.. ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో డాక్‌ మహరాజ్‌ మువీని నిర్మించారు. ఇందు‌లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ప్రతినాయకుడు (విలన్) పాత్రలో అలరించారు. పాటల మాంత్రికులు థమన్ స్వరాలు సమకూర్చారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, రూబెన్ – నిరంజన్ దేవరమానే ఎడిటింగ్‌ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.