AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: గేమ్ చేంజర్ మువీపై భారీ కుట్ర.. రంగంలోకి పోలీసులు! అసలేం జరిగిందంటే

చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా మువీ విడుదలైన తొలిరోజే నిమిషాల వ్యవధిలో కేటుగాళ్లు లీకు చేస్తున్నారు. దీంతో ఆయా చిత్రబృందాలు భారీ నష్టపోతున్నాయి. అయితే తాజాగా ఏకంగా గ్లోబర్ స్టార్ మువీపైనే వీరి కన్ను పడింది. అంతేనా.. మువీ విడుదలకు ముందు నుంచే బెదిరింపులకు తెగించారు. తాము అడిగినంత ఇవ్వకపోతే నెట్టింట లీక్ చేస్తామని ఏకంగా సదరు సినిమా యూనిట్ లోని పలువురు ఫోన్లకు మెజేస్ లు కూడా పెట్టారు..

Game Changer: గేమ్ చేంజర్ మువీపై భారీ కుట్ర.. రంగంలోకి పోలీసులు! అసలేం జరిగిందంటే
Game Changer
Srilakshmi C
|

Updated on: Jan 13, 2025 | 4:46 PM

Share

వందలాది కోట్ల రూపాయలు కుమ్మరించి గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీకైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గేమ్‌ చేంజర్‌ మువీ విషయంలో ఇదే దారుణం జరిగింది. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘గేమ్ చేంజర్’ మువీ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీకైంది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఓ ముఠా ఉన్నట్లు తేలింది.

‘గేమ్ చేంజర్’ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరింపులకు దిగారు. ‘గేమ్ చేంజర్’ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత HD ప్రింట్ లీక్ చేయడమే కాకుండా టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.

దీంతో ‘గేమ్ చేంజర్’ చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో చిత్ర బృందం కంప్లైంట్ చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి ‘గేమ్ చేంజర్’ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి. ఈ క్రమంలో కేటుగాళ్ల వాట్సప్ చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Game Changer Movie Piracy

Game Changer Movie Piracy

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక పథకం ప్రకారం ‘గేమ్ చేంజర్’ మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా అడ్డుకున్నారు. సదరు సోషల్‌ మీడియాల మీద కూడా చిత్ర బృందం కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియాలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..