Actress Anshu: అన్షుపై అనుచిత వ్యాఖ్యలు.. మహిళలందరికీ నా క్షమాపణలు: దర్శకుడు త్రినాథరావు
టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో వివాదం చర్చనీయాంశంగా మారుతుంది.. నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలందరికీ క్షమాపణలు చెబుతూ త్రినాధరావు వీడియో విడుదల చేశారు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో వివాదం చర్చనీయాంశంగా మారుతుంది.. నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్రినాథరావు డైరెక్షన్ లో ‘మజాకా’ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు.. రావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో త్రినాధరావు మాట్లాడుతూ.. సినిమా కోసం ఎలా సన్నద్ధమవ్వాలని చెప్పానో ఆమె అలా చేసిందంటూ.. అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ప్రజా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తంచేశాయి.. త్రినాధరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.. కాగా.. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్రినాధరావు స్పందించారు.. మహిళలందరికీ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు..
‘‘అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు.. తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను.’’ అంటూ వీడియోను షేర్ చేశారు..
వీడియో చూడండి..
త్రినాథరావుకి మహిళా కమీషన్ నోటీసులు..
ఇదిలాఉంటే.. నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది.. ఈ నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. దర్శకుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఈ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..