Charan Rory : పాకిస్థాన్ లో చిక్కుకున్న కుర్రాడి కథతో రాబోతున్న ‘రొరి’.. ఆకట్టుకుంటున్న పోస్టర్
నయా హీరోల జోరు టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. విభిన్న కథ కథనాలతో కొత్త హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు.

Charan Rory : నయా హీరోల జోరు టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. విభిన్న కథ కథనాలతో కొత్త హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమాతో అందరికి సుపరిచితుడైన చరణ్ రొరి హీరోగా కరిష్మా హీరోయిన్ గా తెరెక్కుతున్న సినిమా రొరి. ఈ సినిమాకు చరణ్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై ఈమూవీని నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ యాక్టర్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నిర్మాత హీరో చరణ్ రోరి పుట్టినరోజు సందర్బంగా చిత్రం మోదటి లుక్ ని క్రేజి దర్శకుడు మారుతి గారు విడుదల చేసారు. మారుతి గారికి చిత్ర యూనిట్ అంతా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా చరణ్ రోరి మాట్లాడుతూ.. ఈ చిత్రం మోదటిలుక్ ని మా శ్రేయాభిలాషులు క్రేజి దర్శకుడు మారుతి గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది అన్నారు. ఈ చిత్ర కథ విషయానికోస్తే హైదరాబాద్ పోలిటికల్ బ్యాక్ డ్రాప్ ఓ జరిగే కుర్రాడి కధ, అనుకోని పరిస్థుతుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ ని వెళ్ళాల్సివచ్చింది, అక్కడ కొంతమంది హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది ఈ చిత్ర కథ, ఈ చిత్ర కథనం ఆద్యంతం ఉత్కంఠ భరితం గా వుంటుంది. త్వరలో టీజర్ ని ట్రైలర్ ని విడుదల చేస్తాము.. అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




