Puneet Raj Kumar: వీరాభిమానం.. పునీత్ సమాధి ఎదుట పెళ్లి చేసేందుకు వచ్చిన జంట.. చివరకు..
చేసిన 29 సినిమాలతోనే అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ సంపాదించారు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. జీవించింది కేవలం 46 ఏళ్లే అయినప్పటికీ ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు.
చేసిన 29 సినిమాలతోనే అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ సంపాదించారు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. జీవించింది కేవలం 46 ఏళ్లే అయినప్పటికీ ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు. యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్…టెలివిజన్ ప్రెజంటర్, ప్రొడ్యూసర్‌గా సినిమా ఫీల్డ్‌లో తన మార్క్ చూపించారు. ఇవన్నీ నాణేనికి ఓవైపు మాత్రమే. ఇవే కాదు.. పునీత్ రాజ్ కుమార్ అంటే 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు.. అవును… అందుకే కంఠీరవకు జనం పోటెత్తారు. తమ గుండెల్లో ఉన్న అప్పు ఆఖరి చూపు కోసం ఆరాటపడ్డారు. ఇప్పటికీ పునీత్ లేరంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్. రోజూ వేల మంది వచ్చి పునీత్ సమాధిని దర్శించుకుంటున్నారు. తాజాగా గంగ, గురు ప్రసాద్ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు శనివారం వెళ్లారు. పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమానులైన వీరిద్దరు రెండేళ్లుగా లవ్‌లో ఉన్నారు. అయితే పునీత్ సమాధి ముందు వివాహం చేసుకోవటానికి అక్కడి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో బాధతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
తమకు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంటే చాలా ఇష్టమని… తమ వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అంగీకరించినట్లు వారు తెలిపారు. కానీ వివాహం చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.
అయితే ప్రేమికుల రిక్వెస్ట్‌పై రాజ్‌కుమార్ ఫ్యామిలీ స్పందించింది. పునీత్ సమాధి ముందు ప్రేమ జంటలు పెళ్లి చేసుకునేందుకు తమకు ఇబ్బంది లేదని, అయితే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. పునీత్ ప్రజల ఆస్తి అని తెలిపింది.
Also Read:n తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని