Tollywood: దివంగత నటుడు ఏవీఎస్ అల్లుడు కూడా ప్రముఖ నటుడు.. ఆయనెవరో మీకు తెల్సా..?
ఏవీఎస్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా జనరల్ సెక్రెటరీగా కూడా అప్పట్లో ఎన్నికయ్యారు.
తెలుగు తెరపై అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్న నటుల్లో ఏవీఎస్ ఒకరు. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ఆయన పాత్రను పండించేవారు. ఆడియెన్స్‌కు నవ్వులు పంచేవారు. తొలుత తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఏవీఎస్… ఆ తరువాత విజయవాడలో విలేఖరిగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్ధికంగా చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. తినడానికి డబ్బుల లేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆకలిని అదుపు చేసుకునేందుకు కిళ్లీ నమిలేవారట. డబ్బుల కోసం తన తెలిసిన విద్య అయిన మిమిక్రీ షోలు చేసేవారట. అలానే ఓ ప్రద్శనలో దిగ్గజ దర్శకుడు బాపు ఆయన్న చూసి.. ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సహాయ పాత్రల్లో మెప్పించారు. దాదాపు 750 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. మాయలోడు, ఘటోత్కచుడు, యమలీల, సిసింద్రీ, ఆవిడా మా ఆవిడే, మావిడాకులు, జయం మనదేరా, అదిరిందయ్యా చంద్రం, వెంకీ, బెండు అప్పారావు, యమగోల మళ్ళీ మొదలైంది, బంగారం, శ్రీరామదాసు, రాధాగోపాళం, సంక్రాంతి, కాశి ఇలా ఎన్నో సినిమాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా కూడా తన అభిరుచి చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా యాక్టివ్‌గా పనిచేశారు.
ఏవీఎస్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రదీప్, ప్రశాంతి. ఏవీఎస్‌కు 2008లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో కుమార్తె ప్రశాంతి.. తండ్రి ఏవీఎస్‌కు కాలేయం దానం చేశారు. వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో.. 2013లో మరణించారు ఏవీఎస్. కాగా ఏవీఎస్ అల్లుడు (కూతురి భర్త) కూడా నటుడే. ఆయన పేరు.. శ్రీనివాస్ దావగుడి. చింటూ అని ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు. ఈయన పలు సినిమాల్లో నటించారు. ఎక్కువగా రవిబాబు మూవీస్‌లో కనిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..