Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Kishan on Casting Couch: ‘ఆమె రాత్రికి రమ్మంది.. నేనూ బాధితుడినే’ రేసుగుర్రం నటుడు

సినీ ఇండస్ట్రీలో 'కాస్టింగ్‌ కౌచ్‌' గురించి తాము ఎదుర్కొన్న చేదు అనుభవానలు నటీనటులు అవకాశం వచ్చినప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా నటుడు, బీజేపీ ఎంపీ అయిన రవి కిషన్ కెరీర్‌ తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు..

Ravi Kishan on Casting Couch: 'ఆమె రాత్రికి రమ్మంది.. నేనూ బాధితుడినే' రేసుగుర్రం నటుడు
Ravi Kishan
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 28, 2023 | 8:50 AM

సినీ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ గురించి తాము ఎదుర్కొన్న చేదు అనుభవానలు నటీనటులు అవకాశం వచ్చినప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా నటుడు, బీజేపీ ఎంపీ అయిన రవి కిషన్ కెరీర్‌ తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్‌లో ఉన్న ఓ నటి తనను ఇబ్బంది పెట్టిందంటూ ఆయన తెలిపారు. కాస్టింగ్ కౌచ్ గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

‘యస్‌.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కానీ దాని నుంచి నేను తప్పించుకోగలిగాను. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కొద్దని మా నాన్న నాకు నేర్పించాడు. నాకు టాలెంట్‌ ఉందని నాకు తెలుసు. అందుకే షార్ట్‌కర్ట్‌ ఎంచుకోలేదు. ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం అని ఓ నటి పరోక్షంగా తన కోరికను బయటపెట్టింది. ఎవరైనా కాఫీ పగటి పూట తాగుదామంటారు. కానీ ఆమె రాత్రి రావాలని ప్రత్యేకంగా చెప్పడంతో నాకు అనుమానం వచ్చి వెంటనే నో చెప్పాను. ఆమె పేరు చెప్పదలచుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు సొసైటీలో మంచి పేరు ఉంది’ అని చెప్పుకొచ్చారు.

కాగా అల్లు అర్జున్‌ హీరోగా నటించిన రేసుగుర్రంలో మువీలో విలగ్‌ పాత్రలో రవికిషన్‌ నటన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ సినిమా ఎంతపెద్ద హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రవికిషన్‌ తెలుగుతోపాటు కన్నడ, హిందీ, బోజ్‌పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించాడు. గతేడాది రిలీజైన ఖాఖీ: ది బీహార్‌ చాప్టర్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటించాడు. సింగింగ్ రియాలిటీ షో ‘స్వర్న్ స్వర్ భారత్’కు హోస్ట్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.