Pawan Kalyan: శిఖరం కంటే గొప్పది రా మా కళ్యాణ్ అన్న మనసు.. పవన్ చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. థియేటర్స్ ను పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి.. పవర్ స్టార్ కటౌట్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తుంటారు ఫ్యాన్స్. అంత క్రేజ్ పవర్ స్టార్ అంటే.. కేవలం హీరోగానే కాదు.. పవన్ కళ్యాణ్ చేసే సేవ కార్యక్రమాలు కూడా అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి.

సాధారణంగా ఏ హీరోకైనా ‘ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. థియేటర్స్ ను పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి.. పవర్ స్టార్ కటౌట్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తుంటారు ఫ్యాన్స్. అంత క్రేజ్ పవర్ స్టార్ అంటే.. కేవలం హీరోగానే కాదు.. పవన్ కళ్యాణ్ చేసే సేవ కార్యక్రమాలు కూడా అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి పవన్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తారని అభిమానులు అంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో చోటా కే నాయుడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేసిన ఓ గొప్ప పని గురించి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో తొలి ప్రేమ సినిమా ఒకటి. ఈ సినిమాలోని ఓ సన్నివేశం షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ అనుకోని సంఘటన జరిగిందట.
చోటాకే నాయుడు మాట్లాడుతూ.. నానక్ రామ్ గూడా లో తొలిప్రేమ సినిమాలోని క్రికెట్ సీన్ షూట్ చేస్తున్నాం. అయితే పవన్ షూటింగ్ కు ఓ సుమోలో వచ్చాడు. క్రికెట్ సీన్ కాబట్టి పవన్ వైట్ కలర్ డ్రస్ లో వచ్చాడు. పవన్ కోసం గెట్ దగ్గర నేను వెయిట్ చేస్తున్నా. పవన్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లోపలి వెళ్లే సమయంలో రోడ్డు పై ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది.ఓ వ్యక్తిని కారు గుద్దేసింది. దాంతో అతను ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. అయితే పవన్ వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని ఎత్తుకొని తన కారును పిలిపించి అందులో ఎక్కించి హాస్పటల్ కు పంపించాడు. షర్ట్ నిండా రక్తపు మరకలు పడ్డాయి.. పవన్ ఆ సమయంలో అన్ని మరిచిపోయాడు. సినిమా, షూటింగ్, డ్రస్ అన్ని మరిచిపోయాడు ఆయనలో ఆ సేవా గుణం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు చోటా కే నాయుడు. దాంతో ఈ వీడియోకు పవన్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. శిఖరం కంటే గొప్పది రా మా కళ్యాణ్ అన్న మనసు అంటున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




