AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటి మేడమ్ మీరేనా.. ఆపద్బాంధవుడు హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూస్తే స్టన్

ఔరా అమ్మకు చెళ్ల అంటూ ఆపద్బాంధవుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆడిపాడిన హీరోయిన్ మీనాక్షి శేషాద్రి గుర్తుంది కదా. ఆపద్బాందవుడు సినిమాలో అమాయకపు హావభావాలతో ప్రేక్షకులకు కట్టిపడేసింది. కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో 1992లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి సరసన మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది.

Tollywood: ఏంటి మేడమ్ మీరేనా.. ఆపద్బాంధవుడు హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూస్తే స్టన్
Meenakshi Seshadri
Ram Naramaneni
|

Updated on: May 29, 2024 | 6:52 PM

Share

మీనాక్షి శేషాద్రి.. గుర్తుందా మీకు..?. ఒకప్పుడు తెలుగులోని అగ్రహీరోలతో ఆడిపాడింది. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో పుట్టారు. తమిళ కుటుంబానికి చెందిన మీనాక్షి శేషాద్రి..  కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్యం గడించారు. ఢిల్లీలో చదువుకునే సమయంలోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయ్యింది. ఇక ఈమెకు మోడల్ గా అవకాశాలు రావడంతో టాప్ మెడల్ గా పేరు తెచ్చుకుంది. అదే ఆమెను సినీ జీవితం వైపు నడిపించాయి. పెయింటర్ బాబు సినిమాతోతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి,  హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. బాలీవుడ్‌లో 30కి పైగా సినిమాల్లో నటించింది మీనాక్షి. తెలుగులోనూ చిరంజీవితో కలిసి నటించింది. అన్న ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటించిన విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్ర పోషించింది. అంతేకాదు మీనాక్షి1980-90లలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది.

1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది మీనాక్షి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది.  ప్రస్తుతం ఈమె అమెరికాలో కుటుంబంతో గడుపుతున్నారు. అక్కడ ఆమె ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యం నేర్పుతున్నారు.  ఆన్‌–స్క్రీన్‌ మీద కనిపించనప్పటికీ ఈ అందాల నటి సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. ‘అప్పుడు–ఇప్పుడూ’ అనే కాప్షన్‌తో పాత, కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటుంది. కాగా మీనాక్షి శేషాద్రికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఆమెను చూసిన నెటిజన్లు గుర్తించలేకపోతున్నారు. అప్పట్లో కుందనపు బొమ్మలా.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండేది ఈ నటి. ఇప్పుడు ఆమెకు 60 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె చార్మింగ్ లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్