కొరటాల శివకు చిరు డైరెక్ట్ వార్నింగ్..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే య/ఏ సెన్సార్ సర్టిఫికెట్ సొంత చేసుకొన్న ఈ చిత్రం..పొంగల్ కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. మెగాస్టార్ […]

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రాబోతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి, సంగీత, బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్, హరి ప్రియ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే య/ఏ సెన్సార్ సర్టిఫికెట్ సొంత చేసుకొన్న ఈ చిత్రం..పొంగల్ కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో నేడు(జనవరి 5న) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఎల్బీ స్టేడియంలో ‘మెగా సూపర్’ పేరుతో నిర్వహిస్తోంది మూవీ టీం. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..కొరటాల శివకు స్టేజ్‌పై సరదాగా వార్నింగ్ ఇచ్చారు. తక్కువ సమయంలో తన సినిమాను పూర్తి చేయమని కొరటాల శివను కోరాడట మెగాస్టార్. దానిపై ‘పబ్లిక్ ముందు కమిట్ అవుతున్నా. వంద రోజులకు ముందే సినిమా పూర్తి చేస్తానని మాటిచ్చావు. మరి ఈ మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ చిరు సరరాదా వ్యాఖ్యానించారు.




