Chiranjeevi: లవ్లీ కపుల్‌కు మెగా ఫ్యామిలీ స్టార్స్ విషెస్.. ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన చిరంజీవి
వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మెగా ఫ్యామిలి. ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వరుణ్ తేజ్ పెళ్లిలో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తెజ్ , అల్లు శిరీష్ సందడి చేశారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నిన్న( నవంబర్ 1న) ఇటలీ లో ఘనంగా జరిగింది. గతకొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మెగా ఫ్యామిలి. ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వరుణ్ తేజ్ పెళ్లిలో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తెజ్ , అల్లు శిరీష్ సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ వివాహం జరిగింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోంది. వరుణ్ పెళ్ళిలో ఇలా మెగా హీరోలందరూ కలిసి ఫోటో దిగారు. కొత్త జంటతో కలిసి మెగా హీరోలంతా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మెగాస్టార్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శిరీష్, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి , అల్లు అర్జున్, నాగబాబు కనిపించారు. ఈ ఫొటోకు ” ఆ విధంగా వీళ్ళు కలిసి ఒక కొత్త ప్రేమతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభించారు , సరికొత్త స్టార్ కపుల్ కు స్టార్స్ శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు చిరు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్ , అంతరిక్షం అనే సినిమాలు చేశారు. మిస్టర్ సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరి ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
