Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. కోటి విరాళం చెక్కు అందజేత

|

Oct 12, 2024 | 8:05 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (అక్టోబర్ 11) హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ. కోటి రూపాయల చెక్ ను చంద్రబాబుకు అందజేశారు చిరంజీవి.

Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. కోటి విరాళం చెక్కు అందజేత
Chiranjeevi, CM Chandra Babu Naidu
Follow us on

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (అక్టోబర్ 11) హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ. కోటి రూపాయల చెక్ ను చంద్రబాబుకు అందజేశారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా
ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ త‌మ వంతుగా ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుని ప్ర‌క‌టిస్తూ విరాళాల‌ను అంద‌జేసింది. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌తీసారి సినీ ప‌రిశ్ర‌మ నుంచి త‌న వంతు మ‌ద్ధతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియ‌చేస్తుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ క‌లిసి తెలుగు రాష్ట్రాల‌కు త‌లో కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా చంద్ర‌బాబు నాయుడుని క‌లిసిన చిరంజీవి త‌న యాబై ల‌క్ష‌ల రూప‌యాల‌ చెక్‌తో పాటు, రామ్ చ‌ర‌ణ్ యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను.. మొత్తం కోటి రూపాయ‌ల చెక్‌ల‌ను అంద‌జేశారు.

కాగా తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సీఎం చంద్రబాబునాయుడు సాదర స్వాగతం పలికారు. కష్ట సమయంలో అండగా నిలబడిన చిరంజీవి, రామ్ చరణ్‌లకు, అలాగే సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.  బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. అయితే ఈరోజు విడుదలైన విశ్వంభర టీజర్ మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

చిరంజీవి విశ్వంభర టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.