Chiranjeevi: సురేఖ పుట్టిన రోజు.. కాళిదాసులా మారిన మెగాస్టార్.. అదిరిపోయే ప్రాసతో ‘చిరు’ కవిత
ఆదివారం (ఫిబ్రవరి 18) సురేఖ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యకు జస్ట్ విషెస్ చెబితే ఏం బాగుంటుందనుకున్నారేమో? అందుకే ఒక అందమైన కవితతో తన భాగస్వామికి బర్త్ డే విషెస్ చెప్పాడు. సురేఖ భుజంపై తన చేయి వేసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి కవి కాళిదాసులా మారిపోయారు. అదిరిపోయే ప్రాసలతో అందమైన కవితను చెప్పాడు. అది కూడా తన సతీమణి సురేఖ కోసం. ఆదివారం (ఫిబ్రవరి 18) సురేఖ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యకు జస్ట్ విషెస్ చెబితే ఏం బాగుంటుందనుకున్నారేమో? అందుకే ఒక అందమైన కవితతో తన భాగస్వామికి బర్త్ డే విషెస్ చెప్పాడు. సురేఖ భుజంపై తన చేయి వేసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన మెగాస్టార్.. “నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ! నా లైఫ్ లైన్ (జీవన రేఖ), నా బలానికి అతిగొప్ప పునాది సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సంతోషకరమైన రోజులు మరెన్నో జరుపుకోవాలి’ అని రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ఫొటో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిరంజీవి షేర్ చేసిన పోస్ట్‌కు వేలల్లో లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. వరుణ్ తేజ్ స్పందిస్తూ బ్లాక్ హార్ట్ ఉన్న ఎమోజీని షేర్ చేశాడు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.చిరంజీవి కవిత చూసి ఆయన ప్రాస అదిరిపోయిందంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి, సురేఖ దంపతులు అమెరికాలో ఉన్నారు. తన స్నేహితుడి కుమారుడి పెళ్లి కోసం అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ వివాహ వేడుకలో చిరంజీవి, సురేఖతో పాటు అల్లు అరవింద్, వెంకటేష్ అందరూ కలిసి కనిపించారు. ఆ ఫొటోల్లో చిరంజీవి లుక్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు సురేఖ పుట్టిన రోజు వేడుకలు కూడా అక్కడే సెలబ్రేట్ చేయనున్నారు చిరంజీవి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి.
చిరంజీవి పోస్ట్..
నా జీవన రేఖ నా సౌభాగ్య రేఖ నా భాగస్వామి సురేఖ !
Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha ! Many Many Happy Returns!💐❤️ pic.twitter.com/JcABQQ1Aey
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2024
స్నేహితుడి కుమారుడి పెళ్లి వేడుకలో చిరంజీవి, వెంకటేశ్..
Delighted to join the wedding celebrations of our very dear friend Kumar Koneru’s son Kiran Koneru and Shaitalya Sree and blessed the new couple! The happiness doubled as our @VenkyMama also joined us 🙂 pic.twitter.com/VTMOu4p56D
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




