Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన డాడీ మూవీ పాప.. అందాలతో అదరగొట్టిన బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

డాడీ మూవీలో మెగాస్టార్ కు జోడీగా సిమ్రాన్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఓ కూతురికి తండ్రిగా కనిపించారు. ఈ సినిమా కథను రచయిత భూపతిరాజా చిరంజీవికి వినిపించినప్పుడు.. ఆయన ఈ కథకు హీరోగా వెంకటేష్ అయితే సరిపోతాడని చెప్పాడు. కానీ భూపతి రాజా ఇది చిరంజీవికి వెరైటీగా ఉంటుందని చెప్పి ఒప్పించాడు.

దుమ్మురేపిన డాడీ మూవీ పాప.. అందాలతో అదరగొట్టిన బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Daddy Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 16, 2024 | 12:45 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో డాడీ సినిమా ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డాడీ మూవీలో మెగాస్టార్ కు జోడీగా సిమ్రాన్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఓ కూతురికి తండ్రిగా కనిపించారు. ఈ సినిమా కథను రచయిత భూపతిరాజా చిరంజీవికి వినిపించినప్పుడు.. ఆయన ఈ కథకు హీరోగా వెంకటేష్ అయితే సరిపోతాడని చెప్పాడు. కానీ భూపతి రాజా ఇది చిరంజీవికి వెరైటీగా ఉంటుందని చెప్పి ఒప్పించాడు. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ కూడా ఈ సినిమాను చూసి చిరంజీవితో అదే అన్నారట. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.?

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..!! హేమ కూతుర్ని చూశారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు

డాడీ సినిమాలో చిరంజీవికి, ఆ చిన్నారికి మధ్య వచ్చే సన్నివేశాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెను తాకుతాయి. అయితే ఆ చిన్నారి ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అని నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు. డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన ఆ చిన్నారి ఇప్పుడు చాలా పెద్దైపోయింది. హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా అందంగా మారింది. ఆమె పేరు అనుష్క మల్హోత్రా..

ఇది కూడా చదవండి :Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే

ముంబై కు చెందిన చిన్నారి అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది. సినిమాలో తన క్యూట్ క్యూట్ మాటలతో మెప్పించిన ఈ చిన్నది ఇప్పుడు గ్లామరస్ లుక్ లోకి మారిపోయింది. ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. చదువు పై దృష్టి పెట్టిన ఈ అమ్మడు సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అడపా దడపా ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన అందాలతో మతిపోగొడుతోంది ఈ చిన్నారి. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.