Megastar Chiranjeevi: గుడ్న్యూస్ షేర్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్..
ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారంటూ ట్వీట్ చేశారు. తనకు ఇష్టమైన దైవం శ్రీఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
ట్వీట్..
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022
రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14, 2012న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. వివాహం జరిగిన దశాబ్దం తర్వాత చిరంజీవి ఇంట్లో ఆనందం వెల్లివిరియబోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.