Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ వ్యవహారంలో కీలక మలుపు.. నాంపల్లి కోర్టుకు నరేశ్.. ఆ ఛానెళ్లకు నోటీసులు
నటుడు నరేశ్ మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమను ట్రోలింగ్ చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు , కొంతమంది వ్యక్తుల పై ఆయన క్రిమినల్ డిఫర్మేశన్ దాఖలు చేశారు.
సోషల్ మీడియాలో తమపై జరుగుతోన్న ట్రోలింగ్ ఆపాలంటూ నటులు పవిత్రా లోకేశ్, నరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మార్ఫింగ్ ఫొటోలు, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. నటుడు నరేశ్ మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమను ట్రోలింగ్ చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు , కొంతమంది వ్యక్తుల పై ఆయన క్రిమినల్ డిఫర్మేశన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు పవిత్ర, నరేశ్ లపై ట్రోలింగ్‌కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వారికి నోటీసులు కూడా జారీ చేసింది.
కాగా గత కొన్ని నెలలుగా నరేశ్, పవిత్రా లోకేశ్ ల బంధంపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో తమను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేపింది. అలాగే ఈ ట్రోల్స్ వెనక నరేశ్ మూడో భార్య రమ్య కూడా ఉందంటూ ఆమెపై కూడా ఫిర్యాదు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..