‘లవర్స్ డే’ని రౌడీకి వదిలేసిన చైతూ..!
విజయ దేవరకొండ అలియాస్ రౌడీ.. కోసం చైతూ ఓ త్యాగం చేశాడు. ‘లవర్స్ డే.. ఫిబ్రవరి 14’ని అర్జున్ రెడ్డి కోసం వదిలేశాడట నాగచైతన్య. ఫిబ్రవరి 14ని వదిలేయడమేంటని.. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కదూ..! ఈ కింద చదవితే క్లారిటీ వచ్చేస్తుంది. ఏదైనా ఫెస్టివల్స్.. సపరేట్ డేట్స్.. ఉన్నాయంటే.. సినిమా వాళ్లకు పండగే అని చెప్పాలి. ముఖ్యంగా.. సంక్రాతికి పెద్ద హీరోల మధ్య గట్టి పోటీనే నెలకొంటుంది. ఇక ఆ తర్వాత.. చెప్పుకోదగ్గది.. ఫిబ్రవరి 14.. ఇక ఈ […]
విజయ దేవరకొండ అలియాస్ రౌడీ.. కోసం చైతూ ఓ త్యాగం చేశాడు. ‘లవర్స్ డే.. ఫిబ్రవరి 14’ని అర్జున్ రెడ్డి కోసం వదిలేశాడట నాగచైతన్య. ఫిబ్రవరి 14ని వదిలేయడమేంటని.. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కదూ..! ఈ కింద చదవితే క్లారిటీ వచ్చేస్తుంది.
ఏదైనా ఫెస్టివల్స్.. సపరేట్ డేట్స్.. ఉన్నాయంటే.. సినిమా వాళ్లకు పండగే అని చెప్పాలి. ముఖ్యంగా.. సంక్రాతికి పెద్ద హీరోల మధ్య గట్టి పోటీనే నెలకొంటుంది. ఇక ఆ తర్వాత.. చెప్పుకోదగ్గది.. ఫిబ్రవరి 14.. ఇక ఈ డేట్ కోసం.. యువ హీరోలందరూ పోటీ పడుతూంటారు. వారి సినిమా లవ్‌ని.. బాక్సాఫీస్ ముందు సక్సెస్ చేసుకోవాలనుకుంటారు.
కాగా.. గత కొద్దిరోజులుగా.. ఈ ఇద్దరు హీరోలు.. బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ‘ఎన్‌సీ19’ చిత్రంతో నాగ్ లవర్స్ డేకి రెడీ అయ్యాడు. ఇక విజయ్ కూడా.. వరల్డ్ ఫేమస్ లవర్‌తో అదే రోజు రాబోతున్నాడు. తాజాగా.. ఈ లవర్స్ డే తేదీని విజయ్ సినిమా కోసం.. నాగ చైతన్య వదిలేశాడని సమాచారం. ఏమైయిందో ఏంటో.. తెలీదు కానీ.. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వనున్నారట. ఎన్‌సీ19ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని చైతూ ప్లాన్ అట. చూడాలి మరి వారి సినిమాటిక్ లవ్ సక్సెస్‌లు అవుతాయో లేదో.