నిఖిల్‌కు బంపరాఫర్.. మరి రాజ్‌తరుణ్ సంగతేంటి..!

అర్జున్‌ సురవరం సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. కంటెంట్ బలంగా ఉండటంతో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. మరోవైపు ఇప్పుడు పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగానూ అర్జున్ సురవరం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో ఇప్పుడు బంపరాఫర్ […]

నిఖిల్‌కు బంపరాఫర్.. మరి రాజ్‌తరుణ్ సంగతేంటి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 03, 2019 | 6:24 PM

అర్జున్‌ సురవరం సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. కంటెంట్ బలంగా ఉండటంతో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. మరోవైపు ఇప్పుడు పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగానూ అర్జున్ సురవరం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో ఇప్పుడు బంపరాఫర్ కొట్టేశాడు.

‘కరెంట్’, ‘కుమారి 21f’ సినిమాలతో రెండు విజయాలను సొంతం చేసుకున్న పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి లెక్కల మాస్టార్ సుకుమార్ కథను, స్క్రీన్‌ప్లేను అందించనున్నాడు. అంతేకాదు సుకుమార్ ప్రొడక్షన్స్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండటం మరో విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నిఖిల్.. తాను ఫుల్ హ్యాపీలో ఉన్నట్లు తెలిపాడు.

అయితే ‘కుమారి 21f’తో రాజ్‌తరుణ్‌కు మొదటి హిట్ ఇచ్చిన పల్నాటి సూర్యప్రతాప్.. అతడితోనే మరో చిత్రాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపుగా పూర్తి అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అదే సమయంలో సుకుమార్, రంగస్థలాన్ని తెరకెక్కిస్తుండటంతో.. ఈ ప్రాజెక్ట్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు ప్రతాప్. ఈ విషయాన్ని సుకుమార్ కూడా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. ప్రతాప్ తన సినిమాను వదలుకొని రంగస్థలంకు అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేశాడని సుకుమార్ తెలిపాడు. ఇక ఈ మూవీ విడుదల తరువాతైనా ప్రతాప్- రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ పూర్తిగా అటకెక్కినట్లు అర్థమవుతోంది.