AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న స్టార్ కపుల్.. మండిపడుతున్న నెటిజన్స్.. ఎందుకంటే..

జమ్మూ కాశ్మీర్‏లోని పహల్గామ్‏లో జరిగిన ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ దాడిలో దాదాపు 27 మంది పర్యాటకులు మరణించగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన ఎంతో మంది పర్యాటకుల జీవితాలు నాశనమయ్యాయి. ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయారు.

Pahalgam Terror attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న స్టార్ కపుల్.. మండిపడుతున్న నెటిజన్స్.. ఎందుకంటే..
Shoaib Ibrahim, Depika Kakk
Rajitha Chanti
|

Updated on: Apr 23, 2025 | 2:46 PM

Share

జమ్మూ కశ్మీర్‏లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది మరణించగా.. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకుని విగతజీవులుగా పడి ఉన్న తమవారిని చూసి గుండె ఆగిపోయేలా రోధిస్తున్నారు. ఈ పెను విషాదం యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉగ్రవాదుల దాడి ఘటనపై సినీతారలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. అయితే ఈ ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు ఓ సెలబ్రెటీ జంట. ఈ ఘటన జరగడానికి కొంత సమయం ముందే ఆ కశ్మీర్ అందాల మధ్య వీరిద్దరు ఫోటోస్ తీసుకున్నారు. వాళ్లీద్దరు మరెవరో కాదు.. దీపికా కక్కర్, షోయబ్ ఇబ్రహీం.

బాలీవుడ్ నటి దీపికా కక్కర్, షోయబ్ ఇటీవల తమ కుమారుడు రుహాన్‌తో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రదాడికి గంట ముందే వాళ్లు ఢిల్లీకి తిరిగి వచ్చారు. అంతకు ముందు ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే ఈ జంట ఫోటోస్ తీసుకుంది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం తాము క్షేమంగా ఉన్నామని చెబుతూ షోయబ్ తన ఇన్ స్టాలో స్టోరీ షేర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ స్టోరీ చివర్లో అతడి రాసిన కొన్ని పదాలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. షోయబ్ తన ఇన్ స్టాలో ”మేము సురక్షితంగా ఉన్నాము. ఈ ఉదయం కాశ్మీర్ నుంచి బయలుదేరాము. ఇప్పుడు మేము సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాము. కొత్తవ్లాగ్ త్వరలో వస్తుంది” అంటూ రాసుకొచ్చాడు.

Shoaib

Shoaib

ఉగ్రదాడి ఘటనతో దేశ మొత్తం దుఃఖంలో ఉన్నారు.. అయినప్పటికీ మీరు మీ వ్లాగ్ ప్రమోట్ చేసుకుంటున్నారు… ప్రజలు బాధతో ఉంటే మీరు కంటెంట్ తయారు చేసుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇంతటి విషాద సమయంలోనూ మీకు మీ వ్లాగ్ షేర్ చేయాలని ఆలోచన ఎలా వస్తుంది.. ? అంటూ సీరియస్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..