AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: వెంకటేశ్, రానాలపై కేసు నమోదు.. ఎందుకంటే..

టాలీవుడ్ హీరో వెంకటేశ్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. కాగా...తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్‌ ఇచ్చింది.

Venkatesh: వెంకటేశ్, రానాలపై కేసు నమోదు.. ఎందుకంటే..
Suresh Babu, Rana, Venkates
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2025 | 6:58 PM

Share

టాలీవుడ్ హీరో వెంకటేశ్‏తోపాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, సురేశ్ బాబు, దగ్గుబాటి అభిరామ్ పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదు చేయాలని నాంల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

అసలు విషయానికి వస్తే..

గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నంద కుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం చెలరేగింది. దీంతో 2022 నవంబర్‌లో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. అదే నెలలో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని.. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్‌లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చేశారు. దీంతో నందకుమార్ మరోసారి వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

శనివారం ఈ విషయంలో తమ ఆదేశాలను పాటించకపోవడంపై FIR నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. హీరో దగ్గుబాటి వెంకటేష్‌, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, అభిరామ్‌పై ఫిల్మ్‌నగర్ పోలీసులు 448, 452,458 రెడ్‌విత్‌ 120-B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..