Tollywood: అందాల అటామ్ బాంబ్.. స్పెషల్ పాటలతోనే ఫేమస్.. 3 నిమిషాలకే దిమ్మతిరిగే రెమ్యునరేషన్..
ఇండస్ట్రీలో ఆమె గ్లామర్ సెన్సేషన్. స్పెషల్ పాటలతోనే నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో క్రేజీ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదండి.. పాన్ ఇండియా సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్.

పాన్ ఇండియా సినీప్రియులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో విదేశాల నుంచి ఇండియాకు వచ్చింది. నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ముంబైలో అడుగుపెట్టింది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అలాగే అవకాశాల పేరుతో పిలిచి అవమానాలు సైతం భరించింది. చివరకు కొందరు నిర్మాతలు ఆమెకు ఆఫర్స్ ఇచ్చి రెమ్యునరేషన్ విషయంలో మోసం చేశారంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రత్యేక పాటలతోనే పాపులర్ అయ్యింది. క్రేజీ స్టెప్పులు, గ్లామర్ లుక్కులతో అల్లాడించేసింది. ఇప్పుడు 3 నిమిషాల పాటకు రూ.2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. ఆమె మరెవరో కాదంది.. బీటౌన్ బ్యూటీ నోరా ఫతేహి.
నోరా ఫతేహి.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. దిల్బర్ పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సాంగ్ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. అలాగే హిందీ బిగ్ బాస్ 9లో పాల్గొంది. తెలుగులో ప్రభాస్, రానా నటించిన బాహుబలి చిత్రంలోనూ ప్రత్యేక పాటలో కనిపించింది. ఇదిలా ఉంటే.. పైన కనిపిస్తున్న ఫోటో ఆమె త్రోబ్యాక్ వీడియోలోనిది. ఇప్పుడు సోషల్ మీడియాలో నోరా ఫతేహికి సంబంధించిన పాత వీడియో తెగ వైరలవుతుంది. అందులో నోరా ఫతేహి చేతిలో ఒక ప్లకార్డు పట్టుకుని కనిపించింది. ఆమె ఎత్తు, పేరు, వయసు, ఇతర విషయాలు కనిపిస్తున్నాయి. 2014లో రోర్ టైగర్స్ ఆఫ్ ద సుందర్బన్స్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
తెలుగులో ఆమె టెంపర్, బాహుబలి, కిక్ 2 చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే హిందీలో పలు సినిమాల్లోనూ కనిపించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది నోరా ఫతేహి.
View this post on Instagram
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..




