AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధనుష్‌తో ఉన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో చేసింది రెండు సినిమాలే..

సెలబ్రిటీల ముచ్చట్లు, షూటింగ్ స్పాట్‌లోని ఆన్-లొకేషన్ చిట్-చాట్‌లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి నెటిజన్లతో పాటు ఫ్యాన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్ తెగ హల్చల్ చేస్తుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ధనుష్‌తో ఉన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో చేసింది రెండు సినిమాలే..
Tollywood
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:45 PM

Share

సెలబ్రిటీల ముచ్చట్లు, షూటింగ్ స్పాట్‌లోని ఆన్-లొకేషన్ చిట్-చాట్‌లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి నెటిజన్లతో పాటు ఫ్యాన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల త్రోబ్యాక్ పిక్స్ తెగ హల్చల్ చేస్తుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఉన్న హీరో హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా.? చాలామంది ఠక్కున ఆ హీరో మరెవరో కాదు కోలివుడ్ స్టార్ ధనుష్ అని చెప్పేస్తారు. మరి ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా.? వారిద్దరూ కలిసి నటించడం అదే మొదటిసారి. తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసింది. కన్నడంలో ఏడు, తమిళంలో పది, మలయాళంలో రెండు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఆమె మరెవరో కాదు షెరీన్ శ్రీనగర్. 2002లో ధనుష్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘తుల్లువదోల్లమయి’ అరంగేట్రం చేసింది షెరీన్. ఈ సినిమాకు కస్తూరి రాజా డైరెక్టర్. బెంగళూరులో పుట్టి పెరిగిన షెరీన్.. కన్నడంలో ‘పోలీస్ డాగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘ధృవ’ మూవీతో కన్నడ ప్రేక్షకులను మెప్పించింది.

పైన పేర్కొన్న ఫోటోను ‘తుల్లువదోల్లమయి’ మూవీ షూటింగ్ సమయంలో తీసింది. ఆ సమయంలో ధనుష్, షెరీన్ ఇద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నారు కదా. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులో అల్లరి నరేష్ హీరోగా ‘జూనియర్స్’ పేరుతో రీమేక్ చేశారు. కాగా, తెలుగులో షెరీన్ శ్రీనగర్ ‘జూనియర్స్’, ‘డేంజర్’ సినిమాలు చేసింది.