Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరో.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ఇప్పుడు మాత్రం ఓ హీరో చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బాలనటుడిగా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఈ హీరో.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

Actor : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరో.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..
Tarun
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2025 | 8:02 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరో. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి బాలనటుడిగా అడుగుపెట్టాడు. చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ రాణించాడు. హీరోగా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు అతడు ఇండస్ట్రీలో లవర్ బాయ్. ముఖ్యంగా ప్రేమకథ చిత్రాలతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో అతడు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. అలాగే చాలా సంవత్సరాలుగా కెమెరాకు సైతం దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? హీరో మరెవరో కాదండి. ఒకప్పటి హీరో తరుణ్.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

ఒకప్పటి హీరోయిన్ రోజా రమణి, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు తరుణ్. అంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత చిన్న వయసులోనే బాలనటుడిగా దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, సాహసం వంటి చిత్రాల్లో నటించారు. కొన్నాళ్లకు నువ్వే కావాలి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో తెలుగులో తరుణ్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, నువ్వే నువ్వే, అదృష్టం, నిన్నే ఇష్టపడ్డాను వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న తరుణ్.. ఆ తర్వాత మాత్రం వరుస ప్లాపులతో సతమతమయ్యాడు. దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలకు దూరమయ్యాడు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్.. అప్పుడప్పుడు సెలబ్రెటీల పార్టీలు, ఇతర వేడుకలలో కనిపిస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం చిరంజీవి బర్త్ డే వేడుకలలో సందడి చేశాడు. తరుణ్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tarun New

Tarun New

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?