AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సినిమాలు వదిలేసి డీజేగా మారిన కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సినీరంగంలో నటీనటులగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో... ఆ పేరును కాపాడుకోవడం కూడా అంతే కష్టం. అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని అవకాశాలు అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే పాపులర్ అయిన నటీనటులు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో ఈ కమెడియన్ ఒకరు.

Actor : స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సినిమాలు వదిలేసి డీజేగా మారిన కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Actor (1)
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2025 | 8:36 AM

Share

సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. తక్కువ సమయంలోనే పాపులారిటీ వచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైనవారు ఉన్నారు. కొంతకాలానికే సినిమాలను విడిచిపెట్టి మరో రంగాన్ని ఎంచుకున్నవారు ఉన్నారు. అందులో ఈ కమెడియన్ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేశాడు. తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు ఇండస్ట్రీని వదిలి డీజేగా పనిచేస్తున్నాడు. తాజాగా అతడికి సంబంధించిన వీడియోస్ ఇన్ స్టాలో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

పైన ఫోటోలో డీజేగా కనిపిస్తున్న ఆ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో పాపులర్ నటుడు. అల్లు అర్జున్ తో కలిసి ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో కనిపించాడు. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. అతడి పేరు బబ్లూ. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం సినిమాతో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆనందం, ఎవడి గోల వాడిదే, ఆర్య, చిరుత, బోణీ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఎవడి గోల వాడిదే, ఆర్య చిత్రాలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్ల క్రితం పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

నటుడిగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన కుటుంబంలో ఒక్కొక్కరు వరుసగా చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. ఇంట్లోనే ఉండిపోవడం వల్ల నటనకు దూరమయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బబ్లూ. మంచి ఆఫర్స్ వస్తే ఇప్పుడు కూడా నటించేందుకు రెడీగా ఉన్నానని అన్నాడు బబ్లూ. సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఇప్పుడు డీజేగా పనిచేస్తున్నాడు బబ్లూ. అతడి ఇన్ స్టాలో మొత్తం డీజే వీడియోస్ కనిపిస్తున్నాయి. 2006 నుంచి డీజేగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటించిన బబ్లూ.. ఇప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా డీజేగా పనిచేసుకోవడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి