Tollywood: ఈ చిన్నోడు స్టార్ హీరో.. అంతేకాదు పవర్ ఫుల్ విలన్.. ఎవరో తెలుసా..?
ఫోటోను చూశారు కదా.. తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు దక్షిణాది స్టార్ హీరో. అంతేకాదు.. బిగ్ స్క్రీన్ పై భయపెట్టే పవర్ ఫుల్ విలన్. ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న ఆ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అభిమానుల్లో బాగా పాపులర్ అవుతోంది. తమిళ, మలయాళ భాషల్లో బాగా పాపులర్ అయిన ఈ నటుడికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

తొలి సినిమా ఫ్లాప్ కావడంతో అతడికి నటించడం రాదంటూ పలు విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడి నటనకు సౌత్ ఇండస్ట్రీ ఫిదా అయ్యింది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం ఇలా భాషల్లోనూ తనకంటూ ఓ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. కంటెంట్ నచ్చితే చాటు హీరోయిజం గురించి ఆలోచించకుండానే సినిమాలు చేసేస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇంతకీ ఎవరో తెలుసా..? పైన ఫోటోను చూశారు కదా.. తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు దక్షిణాది స్టార్ హీరో. అంతేకాదు.. బిగ్ స్క్రీన్ పై భయపెట్టే పవర్ ఫుల్ విలన్. ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న ఆ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అభిమానుల్లో బాగా పాపులర్ అవుతోంది. తమిళ, మలయాళ భాషల్లో బాగా పాపులర్ అయిన ఈ నటుడికి చాలా మంది అభిమానులు ఉన్నారు.
హీరోగా చేసినా, విలన్‌గా నటించినా అన్ని పాత్రలను అంగీకరించే ఈ నటుడు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోయడం మరువడు. తన తొలి సినిమా ఫ్లాప్ కావడంతో తనకు నటించడం రాదంటూ పలు విమర్శలు వచ్చాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు మాస్ కమ్ బ్యాక్ ఇచ్చి తన నటనతో సినిమా ఇండస్ట్రీని వెనక్కి చూసేలా చేసాడనే చెప్పాలి. ఈ హీరో తండ్రి మలయాళ సినీ పరిశ్రమలో చాలా పాపులర్ డైరెక్టర్. అలాగే అతడి భార్య కూడా స్టార్ హీరోయిన్. అతడు మరెవరో కాదు.. మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్.
సూపర్ డీలక్స్, విక్రమ్, మామన్నన్, వడైయాన్ వంటి చిత్రాల్లో నటించిన ఫహద్ ఫాజిల్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుషం 16, పూవే పూచూడవా, వలందాంకు చిర్మాషా వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు బాసిల్ కుమారుడు ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్. హీరోయిన్ నజ్రియా నజిమ్ భర్త. అభిమానులు అతడిని ముద్దుగా ఫాఫా అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.
ఇటీవలే ఆవేశం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఫహద్ పాజిల్. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




