AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సీ యూ సూన్’ మూవీ రివ్యూ

కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో కూడా మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ చెల‌రేగిపోతుంది. అదిరిపోయే కంటెంట్ ఉన్న చిత్రాల‌తో ఓటీటీల ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రిస్తోంది.

'సీ యూ సూన్' మూవీ రివ్యూ
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2020 | 5:51 PM

Share

చిత్రం: సీ యూ సూన్ (మలయాళం) నటీనటులు: ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్ రచన, దర్శకత్శం: మహేష్ నారాయణ్ నిర్మాతలు: ఫాహద్ పాజిల్, నజ్రియా నాజిం మ్యూజిక్: గోపి సుందర్ ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇంట్రో :

కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో కూడా మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ చెల‌రేగిపోతుంది. అదిరిపోయే కంటెంట్ ఉన్న చిత్రాల‌తో ఓటీటీల ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రిస్తోంది. తాజాగా మరో భావోద్వేగమైన క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రం ‘సీ యూ సూన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌ల‌యాళ స్టార్ యాక్ట‌ర్ ఫాహీద్ ఫాజిల్, ‘కప్పేలా’‌ ఫేమ్ రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఓనం పండుగ‌ సందర్భంగా ప్రైమ్ ద్వారా రిలీజైంది. విభిన్నమైన టేకింగ్, టెక్నిక‌ల్ వాల్యూస్, ఫీల్‌గుడ్ కంటెంట్‌తో ఐఫోన్‌తో ఈ సినిమాను తీయడం విశేషం. చిత్రం ఎలా ఉందో స‌మీక్షలో చూద్దాం.

క‌థ‌ :

దుబాయ్‌లో ఫైనాన్సియల్ ఫీల్డ్‌లో వ‌ర్క్ చేసే జిమ్మి కురియన్ (రోషన్ మ్యాథ్యూ)కి డేటింగ్ యాప్ ద్వారా అను సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్)‌ అనే అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆ పరిచ‌యం చాటింగ్ ద్వారా త‌ర్వాతి కాలంలో ప్రేమ‌గా మారుతుంది. ఈ క్ర‌మంలో ఓ రోజు అనుతో ప్రేమ విషయాన్ని తన బంధువు, సైబర్ సెక్యూరిటీ ట్రాక్ చేసే కెవిన్ థామస్ (ఫాహద్ ఫాజిల్)కు చెప్పి హెల్ప్ కోర‌తాడు. అను.. తాను ఇబ్బందులు ఎదుర్కుంటున్నాన‌ని, తాను ఉంటున్న ఏరియాలో తీవ్ర క‌ష్టాలు ప‌డుతున్నాన‌ని అంటూ  సహాయం కోరుతుంది. దాంతో అను సెబాస్టియన్‌ను ఆమె ఉంటోన్న ఏరియా నుంచి తన ఫ్లాట్‌కు తీసుకొస్తాడు జిమ్మి . ఆ తర్వాత అను సెబాస్టియన్‌‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చట్టవ్యతిరేకంగా డేటింగ్ చేసినందుకు దుబాయ్ పోలీసులు జిమ్మిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అసలు అను సెబాస్టియన్‌ ఎవరు? ఆమెపై పోలీసులు ఎందుకు ఫోక‌స్ పెట్టాడు? అలాగే అను వల్ల జిమ్మికి ఎదురైన ప్రాబ్ల‌మ్స్ ఏంటి? ఏ విధంగా జిమ్మి దుబాయ్ పోలీసుల నుంచి బయటపడ్డారు. జిమ్మికి ఎదురైన సమస్యను కెవిన్ త‌న టాలెంట్‌తో ఎలా ప‌రిష్క‌రించాడు వంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సాంకేతిక వ‌ర్గం :

సాంకేతిక విభాగాల విషాయానికి వస్తే.. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతం అని చెప్పాలి. సబిన్ ఉలికాందీ వర్చువల్ సినిమాటోగ్రఫి, మహేష్ నారాయణ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా కుదిరాయి. ఐఫోన్‌లో చిత్ర‌క‌రించిన ఈ చిత్రం యొక్క నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

ఫైన‌ల్ థాట్  : ‘సీ యూ సూన్’..వెంట‌నే చూడాల్సిన చిత్రం

Also Read :

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి

జున్నుగాడితో నానిగారి ఆన్‌లైన్ క్లాసులు

ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్