Devara Movie: ‘దేవర’తో చేతులు కలిపిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్.. ఎన్టీఆర్ ప్లాన్ మాములుగా లేదుగా..
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల టిల్లు సినిమా ఫంక్షన్ లో కూడా అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా దేవర సినిమా ఉంటుందన్నాడు ఎన్టీఆర్.

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల టిల్లు సినిమా ఫంక్షన్ లో కూడా అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా దేవర సినిమా ఉంటుందన్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర సినిమా విడుదల కానుంది. కాగా యువసుధ ఆర్ట్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలు సంయుక్తంగా ‘దేవర’ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పుడీ సినిమాలోకి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ అడుగుపెట్టాడు. అదేంటంటే హిందీ చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా కరణ్ జోహార్ కు మంచి క్రేజ్ ఉంది. ఆయనకు కేవలం బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనూ స్నేహితులున్నారు. గతంలో కరణ్ జోహార్ ‘బాహుబలి 1’ చిత్రాన్ని ఉత్తర భారతదేశంలో తన సొంత ‘ధర్మ ప్రొడక్షన్స్’ ద్వారా విడుదల చేశాడు. నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా అతనికి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేతులు కలిపాడు కరణ్ . దేవర సినిమాను ఉత్తర భారతంలో విడుదల చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు . నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్నారు. దీంతో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
దేవర సినిమాలో భాగమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కరణ్ జోహార్. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశాడు. కాగా దేవర సినిమాలో జాన్వీతో పాటు శ్రుతి మరాఠే కూడా నటించనుంది. అలాగే ఇందులో తారక్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం ఉటుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కరణ్ జోహర్ తో దేవర చిత్ర బృందం..
Brace yourself for a mass hurricane!🌊
We are proud to announce our partnership for the north theatrical distribution rights for the next big cinematic experience in Indian cinema!🔥
Man of Masses Jr NTR’s #Devara – in cinemas 10th October, 2024. @tarak9999 #KoratalaSiva… pic.twitter.com/1v0q6gFmqG
— Dharma Productions (@DharmaMovies) April 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








