ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించ‌ని విషాదం..కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

బాలీవుడ్‌ను కరోనా కలవ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టికే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోకింది. తాజాగా బాలీవుడ్ ప్ర‌ఖ్యాత నిర్మాత‌ అనీల్ సూరి క‌రోనా కన్నుమూశారు. అనీల్ సోదరుడు , నిర్మాత రాజీవ్ సూరీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించ‌ని విషాదం..కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
Follow us

|

Updated on: Jun 06, 2020 | 11:04 AM

బాలీవుడ్‌ను కరోనా కలవ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టికే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోకింది. తాజాగా బాలీవుడ్ ప్ర‌ఖ్యాత నిర్మాత‌ అనీల్ సూరి క‌రోనాతో కన్నుమూశారు. అనీల్ సోదరుడు , నిర్మాత రాజీవ్ సూరీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. అనీల్.. జూన్ 2 నుండి తీవ్ర జ్వ‌రంతో బాధపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత రోజు నుంచి ఆయన హెల్త్ కండీష‌న్ సీరియ‌స్ గా మారింద‌ని రాజీవ్ సూరి తెలిపారు. దీంతో అనీల్ సూరిని హుటాహుటిన‌ లీలావతి, హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఆస్పత్రి స్టాఫ్ సైతం ఆయనను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారని అనీల్ సోదరుడు వివ‌రించారు. దీంతో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్ లో అనీల్ ట్రీట్మెంట్ పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

శుక్రవారం ఉదయం కేవలం ఫ్యామిలీ మెంబ‌ర్స్ సమక్షంలో అనీల్ అంత్యక్రియలు జ‌రిపారు. అనీల్‌కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనీల్ సూరి .. రాజ్‌కుమార్‌, రేఖ కాంబోలో ‘కర్మయోగి’, ‘రాజ్‌ తిలక్‌’ వంటి సినిమాలు నిర్మించారు. ఆయన సోదరుడు రాజీవ్‌ సూరి .. 1979లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, మౌసమి ఛటర్జీ జంటగా బసు ఛటర్జీ డైరెక్ష‌న్ లో ‘మంజిల్’ సినిమాని నిర్మించారు.