‘తలైవి’ డిజిట‌ల్ హ‌క్కులు అదిరిపోయే ధ‌ర‌కు..

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇప్ప‌టికే చాలా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీ బాట‌పట్టాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా అదే మార్గాన్ని అనుస‌రించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్​… సినిమాను ఖ‌చ్చితంగా థియేట‌ర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్​పైనా తన ఒపినియ‌న్ చెప్పుకొచ్చింది న‌టి కంగ‌నా. “తలైవి వంటి అధిక‌ బడ్జెట్​, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌ పొందగలిగే చిత్రాన్ని మొద‌ట‌ డిజిటల్​ వేదికగా రిలీజ్ చేయలేం. ఇదే […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:28 am, Sat, 6 June 20
'తలైవి' డిజిట‌ల్ హ‌క్కులు అదిరిపోయే ధ‌ర‌కు..

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇప్ప‌టికే చాలా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీ బాట‌పట్టాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా అదే మార్గాన్ని అనుస‌రించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్​… సినిమాను ఖ‌చ్చితంగా థియేట‌ర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్​పైనా తన ఒపినియ‌న్ చెప్పుకొచ్చింది న‌టి కంగ‌నా.

“తలైవి వంటి అధిక‌ బడ్జెట్​, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌ పొందగలిగే చిత్రాన్ని మొద‌ట‌ డిజిటల్​ వేదికగా రిలీజ్ చేయలేం. ఇదే లిస్టులోకి మణికర్ణిక కూడా వస్తుంది. అయితే పంగా, జడ్జిమెంటల్​ హై క్యా మూవీస్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకున్నా.. ఇవి డిజిటల్​ ఫ్రెండ్లీ సినిమాలు. అవి అక్కడ కూడా మంచి లాభాలను సంపాదించాయి. కాబట్టి ఓటీటీలో రిలీజ్ అనేది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది” అని కంగ‌నా రనౌత్​ పేర్కొన్నారు.

జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ తెర‌కెక్కింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​ రూ.55 కోట్లకు సొంతం చేసుకున్నట్లు కంగనా తెలిపింది. ఏ.ఎల్‌ విజయ్ తెర‌కెక్కించిన ఈ మూవీలో ఎమ్‌జీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్ సినిమాను నిర్మించారు.