Stree 2 Movie : దుమ్మురేపుతోన్న స్త్రీ 2.. కల్కి 2898 రికార్డ్ ను టచ్ చేసిందిగా..!
సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి చాలా మంది సూపర్ స్టార్ల సినిమాల రికార్డ్ ను 'స్త్రీ 2' సినిమా బీట్ చేసింది. ఏ సినిమా అయినా విడుదలైన రెండో వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టిందంటే అది రికార్డే.. అయితే 'స్త్రీ 2' మూడో వారాంతంలో కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.
బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాల్లో రీసెంట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా స్త్రీ2. హారర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్త్రీ 2 అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొట్టేందుకు దూసుకుపోతోంది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి చాలా మంది సూపర్ స్టార్ల సినిమాల రికార్డ్ ను ‘స్త్రీ 2’ సినిమా బీట్ చేసింది. ఏ సినిమా అయినా విడుదలైన రెండో వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టిందంటే అది రికార్డే.. అయితే ‘స్త్రీ 2′ మూడో వారాంతంలో కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన ఈ చిత్రం పెద్ద స్టార్స్ సినిమాలను వెనుకకు నెట్టివేసింది.
స్త్రీ 2’ ట్రైలర్ విడుదలైనప్పుడు, ప్రేక్షకులు అది చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాదిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. హిట్ కొడుతుంది అంతే అని భావించారు. కానీ ఈ సినిమా ఊహించని విధంగా దూసుకుపోతోంది. ‘స్త్రీ 2’ బడ్జెట్ రూ. 50-60 కోట్లు. అయితే విడుదలైన మొదటి రోజునే, ఈ చిత్రం బడ్జెట్ కంటే ఎక్కువ వసూలు చేసింది. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారాంతపు వసూళ్ల విషయానికొస్తే, ‘జవాన్’, ‘కల్కి 2898 AD’, ‘గదర్ 2’, ‘బాహుబలి 2’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను ‘స్త్రీ 2’టచ్ చేసింది.
మూడవ వారాంతంలో వసూళ్ల విషయానికొస్తే.. ‘స్ట్రీ 2’ వారాంతంలో మొదటి రోజు అంటే శుక్రవారం 8.5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీని తర్వాత శనివారం రూ.16.5 కోట్లు, ఆదివారం దాదాపు రూ.22 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా విడుదలైన మూడో వారాంతంలో ఇంత భారీ వసూళ్లు రాబట్టలేదు. మూడో వారాంతంలో రూ.47 కోట్ల బిజినెస్ చేసింది స్త్రీ2. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.650 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.