AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasthuri Shankar: నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.. నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్

మోహన్‌లాల్, సురేశ్ గోపీ ప్రశ్నలకు ఎందుకు దూరంగా ఉంటారని, ప్రశ్నలకు దూరంగా ఉంటేనే అనుమానం వస్తుందని, ఆ ప్రశ్నలకు సురేశ్ గోపీకి కోపం రాకూడదని నటి కస్తూరి అన్నారు. కస్తూరి మనోరమ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వస్తోన్న ఆరోపణల దృష్ట్యా ముఖేష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె అన్నారు. మలయాళ సినిమా నుంచి తనకు కూడా చేదు అనుభవం ఎదురైందని, ఆ తర్వాత మలయాళ సినిమాలో నటించలేదని కస్తూరి తెలిపారు.

Kasthuri Shankar: నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.. నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
Kasthuri
Rajeev Rayala
|

Updated on: Sep 02, 2024 | 11:41 AM

Share

మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. చాలా మంది ఈ హీరోయిన్స్ బయటకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాల గురించి మాట్లాడుతున్నారు. తాజాగా నటి కస్తూరి కూడా హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. మోహన్‌లాల్, సురేశ్ గోపీ ప్రశ్నలకు ఎందుకు దూరంగా ఉంటారని, ప్రశ్నలకు దూరంగా ఉంటేనే అనుమానం వస్తుందని, ఆ ప్రశ్నలకు సురేశ్ గోపీకి కోపం రాకూడదని నటి కస్తూరి అన్నారు. కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వస్తోన్న ఆరోపణల దృష్ట్యా ముఖేష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె అన్నారు. మలయాళ సినిమా నుంచి తనకు కూడా చేదు అనుభవం ఎదురైందని, ఆ తర్వాత మలయాళ సినిమాలో నటించలేదని కస్తూరి తెలిపారు.

సురేష్ గోపి, మోహన్‌లాల్ మీడియా మీడియా ప్రశ్నలను దాటేస్తున్నారు. ఇది సందేహానికి కారణమని కస్తూరి అన్నారు. మోహన్ లాల్ దగ్గర ఎందుకు సమాధానం లేదు.? పలువురు స్టార్స్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించిన వ్యక్తి ఆయన. నా సినిమాలో ఆడవారిపై హింస లేదని చెప్పనివ్వండి చూద్దాం.!, మోహన్‌లాల్ ఎందుకు అలా అనడం లేదు.? అని కస్తూరి ప్రశ్నించారు. అందరూ అమ్మకు రాజీనామా చేసి ఎందుకు పారిపోయారు.? ఆరోపణలు అబద్ధమైతే స్పందించండి. ఎందుకు స్పందించడం లేదు.? అని కస్తూరి ప్రశ్నలు కురిపించారు. సురేష్ గోపి కేవలం నటుడిగానే కాదు, మంత్రికూడా అయ్యారు ఆ బాధ్యతను సురేశ్ గోపీకి ఉంది. ఆయన కేరళ ప్రజలతో బహిరంగంగా మాట్లాడాలి.

హేమ కమిటీ రిపోర్ట్ గాసిప్ కాదు అధికారిక నివేదిక. మలయాళ చిత్రసీమలో ఎన్నో మంచి సినిమాలు చేశానని, అయితే చివరిగా నటించిన సినిమా తనకు మంచి అనుభూతిని ఇవ్వకపోవడంతో మళ్లీ మలయాళ సినిమాలు చేయలేదు అని తెలిపింది కస్తూరి. ‘‘మలయాళంలో అనియన్ బావ చేతన్ బావ, రథోత్సవం వంటి మంచి సినిమాలు చేశాను. కానీ మలయాళంలో నేను చేసిన చివరి సినిమా నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది. అక్కడ ఆర్థిక పరిస్థితులు బాలేవు. ప్రొడక్షన్ కంట్రోలర్ తరచూ కోపంగా ఉండేవాడు. రెండు రోజుల తర్వాత షూటింగ్ సెట్ నుంచి నేను వెళ్లిపోయానని కస్తూరి తెలిపారు. చెడ్డ వ్యక్తులు ప్రతిచోటా ఉంటారు. నాకు కూడా చాలా చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అలా అని అందరూ చెడ్డవారు కాదు అని కస్తూరి చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.