Aishwarya Rai- Abhishek Bachchan: కలిసి కనిపించిన ఐశ్వర్య, అభిషేక్.. వైరల్‌గా మారిన వీడియో.. కానీ
ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో కలిసి అనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహానికి కూడా హాజరయ్యారు. అభిషేక్ విడిగా తన తల్లిదండ్రులతో హాజరయ్యారు. బచ్చన్ కుటుంబంతో వారి కోడలు కనిపించకపోవడం విడాకుల చర్చలకు ఆజ్యం పోసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొన్ని నెలలుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూరేలా ఈ మధ్య అభిషేక్, ఐశ్వర్య కలిసి ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో కలిసి అనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహానికి కూడా హాజరయ్యారు. అభిషేక్ విడిగా తన తల్లిదండ్రులతో హాజరయ్యారు. బచ్చన్ కుటుంబంతో వారి కోడలు కనిపించకపోవడం విడాకుల చర్చలకు ఆజ్యం పోసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐశ్వర్య,అభిషేక్ మధ్య అంతా బాగానే ఉందని, ఇద్దరూ తమ కుమార్తెతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్నారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది.
విడాకుల చర్చల మధ్య, అభిషేక్, ఐశ్వర్య తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల పేజీలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ‘దుబాయ్ ఎయిర్‌పోర్ట్’ అని రాసి ఉంది. దాంతో విడాకుల చర్చలు కేవలం పుకార్లు మాత్రమే అని ఈ ఇద్దరూ ఇప్పటికీ కలిసి ఉన్నారని ఈ వీడియో చూస్తే అర్ధమవుతోంది. అభిషేక్-ఐశ్వర్యల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఐశ్వర్య-అభిషేక్‌ల ఈ వీడియో ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో కాస్త వెతికితే ఈ వీడియో ఫిబ్రవరి నెలకి సంబంధించిన వీడియో అని తెలుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ఎయిర్‌పోర్ట్‌లోనిది. ఓ వెకేషన్ కు వెళ్లి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఆరాధ్య కలిసి బయటకు వచ్చారు. కాగా విడాకుల చర్చల సమయంలో, అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను లైక్ చేశాడు. ఆ పోస్ట్ విడాకులకు సంబంధించింది. కాగా ఐశ్వర్య రాయ్‌కు అభిషేక్ బచ్చన్ తల్లి జయ బచన్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని. అందుకే ఐష్ కూతురితో కలిసి విడిగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి ఈ ఇద్దరూ నిజంగా విడిపోతున్నారా.? లేక ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.