Actress: గర్భం దాచి అభిమానులకు షాక్ ఇచ్చిన ముద్దుగుమ్మలు వీరే..
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు వామిక అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్టార్ జంట ఇంతవరకు తమ కుమార్తె ముఖాన్ని చూపించలేదు. ఎక్కడ ఫోటోలు పోస్ట్ చేయలేదు. అలాగే మీడియా కంట కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే అనుష్క మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఈ జంట నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు.
చాలా మంది సినిమా తారలు తమ గర్భం గురించి, తమకు పుట్టిన బిడ్డ గురించి ఎక్కువగా బయట పెట్టారు. కొంతమంది ముద్దుగుమ్మలు పెళ్ళైన వెంటనే తాము కడుపుతో ఉన్నామని పోస్ట్ లు పెట్టి షాక్ ఇచ్చారు కూడా.. ఇలా తల్లికాబోతున్న విషయాన్నీ దాచి అభిమానులకు షాక్ ఇచ్చిన భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.! అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు వామిక అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్టార్ జంట ఇంతవరకు తమ కుమార్తె ముఖాన్ని చూపించలేదు. ఎక్కడ ఫోటోలు పోస్ట్ చేయలేదు. అలాగే మీడియా కంట కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే అనుష్క మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఈ జంట నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. ఇటీవల అనుష్క శర్మ పబ్లిక్‌గా కనిపించడం లేదు. టీమిండియా మ్యాచ్ జరిగిన ప్రతిసారీ అనుష్క శర్మ మ్యాచ్ చూసేందుకు వచ్చేది. అయితే ఈసారి అక్కడ కూడా ఆమె కనిపించలేదు. దీంతో ఆమె గర్భవతి అనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అనుష్కలాగే చాలా మంది నటీమణులు తాము గర్భవతి అన్న విషయాన్నీ దాచిపెట్టారు.
అలియా, రణబీర్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. పెళ్లయిన కొద్ది నెలలకే అలియా గర్భవతి అని ప్రకటించారు. అలియా ప్రెగ్నెంట్ అనే వార్త విని చాలా మంది షాక్ అయ్యారు. ఈ జంటకు పాప జన్మించింది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ వివాహం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. సరోగసీ ద్వారా ఈ జంట బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టే వరకు ఈ విషయాన్ని ప్రియాంక చాలా గోప్యంగా ఉంచింది. టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియా శరణ్ కూడా తన కూతురిని మీడియా కంట పడకుండా చాలా రోజులు దాచిఉంచింది. ఆమె 2018లో ఆండ్రీ కొచెవ్‌ను వివాహం చేసుకుంది. బిడ్డ పుట్టిన ఏడాది తర్వాత ఆ విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చింది శ్రియ.
నేహా ధూపియా అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. నేహా కూడా తనకు బిడ్డ పుట్టిన విషయాన్నీ ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తపడింది. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది నేహా. బిడ్డ పుట్టిన విషయం తెలిస్తే ఆఫర్స్ తగ్గిపోతుందేమోనని ఆమె భయపడిందట. అటు బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కూడా తన పెళ్లి గర్భం విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాణి 2014లో యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లాడింది. తన పెళ్లి గురించి బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు. అలాగే బిడ్డ పుట్టే విషయంలోనూ అలాగే చేసింది ఈ బ్యూటీ. ఇటీవలే టాలీవుడ్ నటి ఇలియానా కూడా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాను గర్భవతిని అని తెలిపి షాక్ ఇచ్చింది ఇలియానా. బిడ్డ పుట్టే వరకు తన బాయ్ ఫ్రెండ్ మొఖాన్ని చూపించలేదు ఈ అమ్మడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.