AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: ముంబైలో అపార్మెంట్ కొన్న టాలీవుడ్ హీరోయిన్.. ధర తెలిస్తే షాకే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. హిందీలో వరుస హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ప్రభాస్ సరసన ఓ హిట్ మూవీలో కనిపించింది. కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేదు. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటుంది.

Shraddha Kapoor: ముంబైలో అపార్మెంట్ కొన్న టాలీవుడ్ హీరోయిన్.. ధర తెలిస్తే షాకే..
Shraddha Kapoor
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2025 | 8:58 PM

Share

గతేడాది భారీ విజయాన్ని అందుకుంది శ్రద్ధా కపూర్. 2024లో ఆమె నటించిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ వసూల్లు రాబట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. గతంలో శ్రద్ధా కపూర్ ఓ లగ్జరీ కారు కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటి కోసం ఆమె చాలా డబ్బు ఖర్చు చేసిందని అంటున్నారు. శ్రద్ధా కపూర్ తన తండ్రి శక్తి కపూర్‌తో కలిసి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన ముంబైలో ఉన్నట్లు సమాచారం. ఈ ఇంటి కొనుగోలు ప్రక్రియ 13 జనవరి 2025 పూర్తైంది. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి శ్రద్ధా కపూర్ ఈ కొత్త ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది.

నివేదిక ప్రకారం ముంబైలోని జుహులో అత్యంత ఖరీదైన పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్‌లో శ్రద్ధా కొత్త అపార్ట్‌మెంట్ ఉంది. ఈ కాంప్లెక్స్ రేస్ కోర్స్, అరేబియా సముద్రం అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు ఈ భవనం మొదటి ఎంపిక. పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్ బిల్డింగ్‌లో 2BHK, 3BHK ఫ్లాట్‌లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ జైప్‌కిడ్ యాక్సెస్ చేసిన పత్రాల ప్రకారం.. కొత్త ఇల్లు 1042.73 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో రెండు పెద్ద బాల్కనీలతో విస్తరించి ఉంది. ఈ అపార్ట్‌మెంట్ చదరపు అడుగు ధర రూ. 59,875. ఇందుకోసం శ్రద్ధా కపూర్ రూ.6.24 కోట్లు చెల్లించింది.

గతంలో 3,928.86 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను ఒక సంవత్సరం లీజుకు తీసుకున్నారు. ఇందుకోసం శ్రద్ధా అడ్వాన్స్‌గా రూ.72 లక్షలు చెల్లించింది. ఈ నటి ఫ్లాట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ ప్రాంతం కూడా ఉందట. ఈ ఇంటికి రూ.36 వేలు స్టాంప్ డ్యూటీ, రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిందట.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!